తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఎఎన్ఎం, జిఎన్ఎం, నర్సింగ్ విద్యార్హత కలిగిన యువతకు జపనీస్ (N5, N4, & N3) భాషపై శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు న్యవిస్ హెచ్ ఆర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎఎన్ఎం, జిఎన్ఎం, బి.ఎస్సి -నర్సింగ్ (ANM / GNM / B.Sc Nursing) చదివిన వారికి జపానీస్ భాష పై N5, N4, మరియు N3 స్థాయిలలో జపానీస్ భాషను నేర్పించి, వారికి జపాన్ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. ఈ శిక్షణ పొoదేందుకు అభ్యర్థులు జపాన్ దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని, 32 సంవత్సరాలు లోపు వయసు ఉన్న యువత యువకులు అర్హులని తెలిపారు.
ఈ శిక్షణ కాలం 6 నెలలు న్యవిస్ హెచ్ ఆర్ కార్యాలయం, బెంగళూరు నందు జరుగుతుంది, శిక్షణ ఫీజు 3,50,000 అక్షరాల మూడు లక్షల యాభై వేల రూపాయలు,ముందుగా పాక్షిక శిక్షణ రుసుమును 50,000 రూపాయిలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 25,000 రూపాయిలు చెల్లిస్తుంది అని మిగిలిన 25,000 రూపాయిలు అభ్యర్ధి చెల్లించాలి అని మిగిలిన 3,00,000 రూపాయలు మూడు విడతలుగా అభ్యర్ధి చెల్లిoచాల్సిందిగా తెలియజేసారు.
శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులకు జపాన్ దేశంలో నెలకి 1,00,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల జీతంతో ఉద్యోగం పొందే అవకాశం ఉందని తెలిపారు.
ఆసక్తి కలిగిన వారు వెబ్సైట్లో https://www.apssdc.in/home/onlineProgramRegistration వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9988853335, 8801346518, 9441993732 ను సంప్రదించాలన్నారు.