విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ ఎనికెపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభోత్సవం మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాల, ఎనికెపాడు నందు ప్రారంభించారని ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఈ స్పెషల్ క్యాంపులో ముఖ్యంగా విద్య, వైద్యం, పరిసరాల పరిశుభ్రత, ఎన్నికలు, న్యాయం, ప్లాంటేషన్ మొదలగు అవగాహన కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు విచ్చేసి ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులు సమాజానికి తమ వంతు కృషి చేయడానికి ఇది చక్కటి అవకాశం అని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ పరిసరాలను ఉంచుకోవడానికి ప్రజలు బాధ్యతతో మెలగడానికి ఎన్ఎస్ఎస్ క్యాంపులు చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ హెడ్మాస్టర్ శ్రీమతి వెంకట సూర్య సత్యవాణి గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ క్యాంపు మా పాఠశాల నందు పెట్టడం ద్వారా మా పాఠశాల పరిసరాలు మెరుగుపడతాయని ఈ క్యాంపు దిగ్విజయంగా జరుగుతుందని తెలిపారు. ఎనికేపాడుగ్రామ సర్పంచ్ శ్రీ పూర్ణచంద్రరావు గారు తన సందేశాన్ని పంపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఆర్ కళాశాల చెందిన 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వి శ్రీనివాసరావు గారు శ్రీమతి శాంతి బాయ్ గారు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …