Breaking News

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు త్యాగం మ‌రువ‌లేనిది

– జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్ప‌దని, మ‌రువ‌లేనిద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ అన్నారు. శ‌నివారం అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు జ‌యంతి సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్ క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పొట్టి శ్రీరాములు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం ఆమ‌ర‌ణ దీక్ష చేసి ప్రాణాల‌ర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగనిర‌తిని ఈ సందర్భంగా స్మ‌రించుకున్నారు. ప్రేమ‌, నిస్వార్థంతో కూడిన గొప్ప వ్య‌క్తి పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. విద్యార్థులు, యువ‌త గొప్ప వ్య‌క్తుల ఆశ‌యాల‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్న‌త స్థానాల‌కు చేరేందుకు కృషిచేయాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, క‌లెక్ట‌రేట్ ఏవో సీహెచ్ నాగ‌లక్ష్మి, క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల సెల్ సూప‌రింటెండెంట్ ఎం.దుర్గాప్ర‌సాద్, క‌లెక్ట‌రేట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *