విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు చేనేతలకు తగిన సీట్లు కేటాయించి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని విస్మరిస్తే ఓడిరచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అద్యక్షులు, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ యంత్రమూ లేని పరిస్థితుల్లో, ఏ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమూ లేని రోజుల్లో మగ్గాన్ని తయారుచేసి, ఆ మగ్గంపై వస్త్రాన్ని నేసి సమస్త మానవాళికి కట్టుబట్టనిచ్చి మానవజాతి మాన, మర్యాదలను కాపాడిన జాతి చేనేతజాతి అన్నారు. మన జాతీయ జెండా మధ్యన ఏ చిహ్నం వుండాలనే చర్చ వచ్చినప్పుడు మన స్వాతంత్య్ర సమరయోధులూ, జాతీయ వాదులందరూ కలసి భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ప్రధాన కారణమైన విదేశీ వస్త్ర బహిష్కరణ-స్వదేశీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన చేనేతల ప్రథాన పరికరం రాట్నం చిహ్నమే వుండాలని నిర్ణయించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఇనమాల శివరాం ప్రసాద్, రాష్ట్ర దేవంగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఏఐడబ్ల్యుఎఫ్ జాతీయ గౌరవ అధ్యక్షులు నక్కిన చిన వెంకట్రాయుడు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఏఐడబ్ల్యుఎఫ్ జాతీయ కార్యవర్గసభ్యులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, అంధ్రప్రదేశ్ కర్ణభక్త సంక్షేమ సంఘం రాజకీయ విభాగ రాష్ట్ర అధ్యక్షులు, ఏఐడబ్ల్యుఎఫ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు వాసా పల్లవ రాజు, భావసార క్షత్రియ సంఘం రాష్ట్ర కార్యవర్గసభ్యులు భందుచోడే మోహన్ లక్ష్మాజిరావు, విజయవాడ కర్ణభక్త సంక్షేమ సంఘం అధ్యక్షులు గుడిమెట్ల శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …