-జిల్లాలో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ద్వారా 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ..
– రబీ లో పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ..
-ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 231 ఆర్భికేల సిద్దం చెయ్యాలి
-మిల్లర్లు అధికారుల మధ్య సమన్వయం ముఖ్యం
-కలెక్టర్ డా కే.. మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్,
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించి, పండిన ధాన్యం సేకరణ కోసం 3.20 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చెయ్యవలసి ఉందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 రబీ సీజన్లో ధాన్యం సేకరణ పై రెవెన్యూ, పౌర సరఫరాల, వ్యవసాయ, సహకార , తూనికలు కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్స్, కాస్టోడియన్ అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చేసేలా అర్భికేల పరిధిలో ఏర్పాటు చేసే కేంద్రాలలో అన్నీ మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావాలని స్పష్టం చేశారు. ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 231 కోనుగోలు కేంద్రాలను సిద్దం చేసి ఆమేరకు కొనుగోళ్లు చేపట్టడం జరగాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 6 హెక్టార్ల లో కోతలు పూర్తి అవ్వటం జరిగిందనీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల హెచ్చరికల వల్ల ఇబ్బందులు లేవని వ్యవసాయ అధికారులు వివరించడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కు ఖచ్చితంగా పాటించడం ముఖ్యం అన్నారు. ఇప్పటి వరకు 4 సీజన్లలో సీకరండ్స్ చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం 5 వ సీజన్ కొనుగోలుకు సంబంధించి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు, ధాన్యం సేకరణ పనులని సమాంతరంగా నిర్వర్తించాల్సి ఉంటుందనీ స్పష్టం చేశారు. ఎన్నికల విధి నిర్వహణ చట్టబద్దత కలిగి ఉంటుందనీ , మరో పక్క రైతుల నుంచి ధాన్యం సేకరణ నిబద్దత కలిగి ఉంటుందనీ అన్నారు. మిల్లర్లు అధికారులూ మధ్య అనుసంధానం అత్యంత కీలకం అన్నారు.
అనంతరం జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లాలో ఈ 2023-24 రబీ లో 57,313 మంది రైతులు 132159 ఎకరాల్ల వరి పంట ఈ క్రాప్ కింద నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం 18 మండల స్థాయి సేకరణ కమిటి ల ద్వారా 142 మిల్లులను గుర్తించి, వాటికి కస్టోడీయన్ అధికారుల నియామకం జరిగినట్లు తెలిపారు. సేకరణ లక్ష్యాలను సాధించడం కోసం 2310 మంది హామలీలు, 355 వాహనాలను సిద్దం చేసుకొవడం జరిగిందనీ పేర్కొన్నారు. మిల్లర్లు ద్వారా బ్యాంక్ గ్యారంటీ కి సంబంధించిన పనులన్నీ సత్వరం పూర్తి చెయ్యాలని ఆదేశించారు. కోనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలింపు ర్యండమనైజేషన్ ద్వారా చేపట్టాలన్నారు. ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకొవాలాన్నారు. మొబైల్ టీమ్స్ ద్వారా కొనుగోళ్ల ను పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కొవ్వూరు సబ్ కలెక్టర్ ఆసుతోష్ శ్రీవాత్సవ, డి ఎమ్ పౌర సరఫరాల శ్రీదేవి, డి ఎస్ వో పి. విజయ భాస్కర్ , డి ఎ వో – ఏస్. మాధవ రావు, తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.