తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పదవ తరగతి మెయిన్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం తిరుపతి కలెక్టర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో త్రాగు నీరు, ఎఎన్ఎం ఏర్పాటుతో అత్యవసర మందులు ఏర్పాటును పరిశీలించారు. అనంతరం ఎస్వీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని, మరుగు దొడ్లు, త్రాగు నీరు ఏర్పాటు ఉన్నాయా అని అడుగగా అన్ని వసతులు ఏర్పాటు చేశామని చీఫ్ సూపరింటెండెంట్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తిరుపతి ఆర్డీఓ నిషాంత్ రెడ్డి ఉన్నారు.
Tags tirupathi
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …