తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లను, బ్యానర్లను అనుమతించబోమని, అనుమతి లేకుండా ఏర్పాటు చేసే సంస్థలు, వ్యక్తులపై,ఏజెన్సీస్ ల పై కూడా పోలీసు కేసులు నమోదు చేయాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అధికారులకు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి), స్టాటిస్టిక్స్ సర్వైలేన్స్ టీం, వీడియోగ్రాఫ్ వ్యూయింగ్ టీం, అకౌంట్స్ ఎక్స్పెండీచర్ టీంలతో ప్రత్య్తేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్&ఆర్ఓ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లో రాజకీయ ప్రకటనల ఏర్పాటుకు అవకాశం లేదని, నిబందనలు మీరితే వారి పై పోలీసు కేసులు నమోదుకు చర్యలు తీసుకోవాలని ఎంసిసి టీంకి స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులు ప్రతి కార్యక్రమానికి రిటర్నింగ్ అధికారి నుండి తగిన అనుమతి పొందాల్సిందేనని, అందుకు తగిన విధంగా జిఎంసి ప్రధాన కార్యాలయంలో సువిధ యాప్ సింగిల్ విండో కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ భవనాలలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్ కు భవన స్ట్రక్చరల్, స్టెబిలిటి సర్టిఫికెట్ తప్పనిసరన్నారు. నగరపాలక సంస్థ కమర్షియల్ ప్రకటనల స్థలాలు, ప్రైవేట్ ప్రకటనల స్థలాల్లో ఉన్న బోర్డ్ లను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిదికన ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. నగరంలో సిటి బస్ లు, ఆటోలపై రాజకీయ ప్రకటనలు ఉంటె తక్షణం కేసులు నమోదు చేయాలని ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం కి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల క్రమంలో తాము చేపట్టే ర్యాలీలు, ప్రచార వాహనాలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, లౌడ్ స్పీకర్ల వినియోగం, తాత్కాలిక పార్టీ కార్యాలయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుచేయాలని, ఎక్కడా పక్షపాత వైఖరి ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఆర్ఓలు, వివిధ టీం ల అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …