విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో తన ఛాంబరులో విడుదల చేసిన ఒక ప్రకటనలో సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కొరకు ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ వాట్స్ అప్ నెంబర్ 9959090025( ఎలక్షన్స్ గ్రీవెన్స్ సెల్ ) ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే ప్రజలు వాట్స్ అప్ ద్వారా ఈ హెల్ప్ లైన్ 9959090025 ( ఎలక్షన్స్ గ్రీవెన్స్ సెల్)కు ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన వెంటే కమాండర్ కంట్రోల్ రూమ్ లో సిబ్బంది ఆ ఫిర్యాదును సంబంధిత ఎన్నికల అధికారులకు పంపి సత్వర పరిష్కారాన్ని అందిస్తారని అన్నారు. ఈ హెల్ప్ లైన్ 9959090025 ( ఎలక్షన్స్ గ్రీవెన్స్ సెల్ ) ద్వారా ప్రజలు ఎన్నికలకు సంబంధించిన వారి ఫిర్యాదులను నిస్సంకోచంగా ఫిర్యాదు చేయవలసిందిగా కమిషనర్ కోరారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …