Breaking News

ఓడిపోతున్నామని తెలిసే అలజడులు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నం

-క్షేత్రస్థాయిలో మూడు పార్టీల సమన్వయం కీలకం
-రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకున్న పొత్తు నిర్ణయం ఇది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘మూడు పార్టీల పొత్తు.. ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా గెలిచి, ప్రజా ప్రభుత్వం స్థాపించాలంటే రాష్ట్ర స్థాయి నాయకుల్లోనే సమన్వయం సాధిస్తే సరిపోదు. పొత్తు పూర్తిస్థాయిలో విజయం సాధించాలంటే బూత్ స్థాయి కార్యకర్తల్లోనూ పూర్తి సమన్వయం అవసరం’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన ఎన్నికల వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ ‘‘వచ్చే ఎన్నికలు అత్యంత కఠినమైనవి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే సంకల్పంతో పొత్తుల కోసం ముందుకు కదిలారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులపై కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నపుడు ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు తెలుస్తున్నాయి. అన్ని వైపుల నుంచీ జాగ్రత్తలు తీసుకోవాలి.

పొత్తుపై విషం చల్లేలా వైసీపీ ప్రయత్నం
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు కుదరదు అనుకున్న తరుణంలో మూడు పార్టీలూ ఏకమై ముందుకు కదలడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. అపజయం వైసీపీ వాళ్ళకి ఇప్పటికే అర్ధమైంది. పొత్తులో ఎలాగైనా అపోహలు నింపడానికి వైసీపీ విశ్వప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా రకరకాల అబద్ధాలను సృష్టించి ప్రచారం చేస్తుంది. దీనిపై మూడు పార్టీల కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే నియోజకవర్గ స్థాయిలో సమసిపోయే అంశమైతే, మూడు పార్టీల నాయకులు మాట్లాడుకొని దాన్ని పరిష్కరించుకోవాలి. రాష్ట్రస్థాయి సమస్య అయితే వెంటనే రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అనవసర ఉద్రేకాలకుపోకుండా, వచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలి. వైసీపీకి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఎలా ఉండబోతోందనేది తెలిసిపోయింది. అందుకే రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని ఎత్తుగడలు వేస్తోంది. శాంతిభధ్రతల సమస్యలు రాష్ట్రంలో తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటివరకు రోజూ మానసిక దాడులు చేసి, సోషల్ మీడియాలో రకరకాల విష ప్రచారాలు పుట్టించిన వైసీపీ నేతలు, విపక్షాలపై భౌతిక దాడులు దిగేందుకు సిద్దమవుతున్నారు. ఈ నెలలోనే ఇలాంటివి రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. దీనిపై మూడు పార్టీలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి మూడు పార్టీలు ఉమ్మడిగా జట్టుకట్టి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి. రాష్ట్రానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలి.’’ అన్నారు.

బాబాయ్ ని చంపేశాం మాకు ఓట్లు వేయండి అని అడుగుతారా?
-ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ పొత్తులకు ముందడుగు వేశారు
-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘‘రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. అసలు వచ్చే ఎన్నికల్లో వీళ్ల నాయకుడు ఏమని ప్రజల్ని ఓట్లు అడుగుతాడు..? బాబాయ్ ని చంపేశాం అని ఓట్లు అడుగుతారా… ఓట్లు వేయకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని అడుగుతారా..? రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ కార్యకలాపాలకు కేంద్రం చేశారు. వైసీపీ పాలన మొదలైన దగ్గర నుంచి వీరు అంతర్జాతీయ స్మగ్లర్లతో చేతులు కలిపినట్లు అర్ధమవుతోంది. గంజాయితోపాటు డ్రగ్స్ కు ఆంధ్రప్రదేశ్ వేదికగా చేశారు. అదిఇది అని కాదు.. అన్నింట్లో అవినీతి, అక్రమంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ దిగజారిపోయింది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు రాష్ట్రం పరువుపోయే పరిస్థితి తీసుకొచ్చారు. దేశంలో 400పైగా సీట్లతో ఎన్టీయే ప్రభుత్వం రావాలి. రాష్ట్రంలో 160 పైగా సీట్లతో ఎన్టీయే ప్రభుత్వం రాష్ట్రంలో రావాలి. అప్పుడే సంపూర్ణ అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు కదులుతుంది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీల నుంచి కొన్ని త్యాగాలు తప్పలేదు. పార్టీ కోసం అయిదేళ్లు కష్టపడిన చాలామందికి సీట్లు రాలేదు. ఇది కేవలం అధికారం కోసం ఏర్పడిన పొత్తు కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా  పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పొత్తులకు ముందడుగు వేశారు. అదే స్ఫూర్తితో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి, సరికొత్త రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందాం’’ అన్నారు.

రాష్ట్రం కోసం తగ్గిన నాయకుడు పవన్ కళ్యాణ్ : పాక సత్యనారాయణ, బీజేపీ నాయకులు
ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాక సత్యనారాయణ గారు మాట్లాడుతూ ‘‘రాష్ట్ర క్షేమమే లక్ష్యంగా ఎక్కడా అహానికి పోకుండా వెనక్కు తగ్గిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రజలకు కంటకంగా మారిన వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలనే ఆయన సంకల్పం ఉన్నతమైనది. మూడు పార్టీల పొత్తు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతోంది. అన్ని స్థాయిల్లోనూ మూడు పార్టీల నాయకుల సమన్వయం దీనికి చాలా అవసరం. లేనిపోని ఈగోలకు పోకుండా ప్రతి ఓటు కచ్చితంగా బదిలీ అయ్యేలా నాయకులు బాధ్యత తీసుకొని పనిచేయాలి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఉండటం వల్ల డబుల్ ఇంజిన్ సర్కారు సాయంతో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. టిక్కెట్ రాని నాయకులు ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఈ ఎన్నికల్లో పనిచేయాలి. అన్ని రంగాల్లో విఫలమైన వైసీపీని ఇంటికి పంపాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది.’’ అన్నారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన నాయకులు కందుల దుర్గేష్, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *