విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్.టి.ఆర్.జిల్లా 2024సం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలోని ముఖ్య ప్రదేశాలలో డి.సి.పి.లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., కె.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్., .టి హరికృష్ణ ల పర్యవేక్షణలో పశ్చిమ డివిజన్ ఏ.సి.పి. మురళికృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో భవానిపురం పోలీస్ స్టేషన్ పరిదిలోని జోజినగర్, ఊర్మిళానగర్ ఏరియాలలో మరియు సెంట్రల్ డివిజన్ ఏ.సి.పి. పి.బాస్కర రావు ఆధ్వర్యంలో పటమట పోలీస్ స్టేషన్ పరిదిలో పి.ఎస్.ఆర్ కాలని, ప్రసాదంపాడు, రామవరప్పాడు ఏరియాలో, ఆయా డివిజన్ల ఇన్స్పెక్టర్లు మరియు సుమారు 200 మంది సివిల్,ఏ.ఆర్. పారామిలటరీ బలగాలు మరియు ఏ.పి.ఎస్.పి. పోలీస్ వారితో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకొనుటకు నిర్భయముగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు.