Breaking News

 చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా…

– ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు..
– అక్రమ మద్యం, డబ్బు ఇతరత్రాలకు అడ్డుకట్ట…
– ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు, విలువైన వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డిల్లీరావు, పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా మంగళవారం జిల్లాలోని చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దులోని అంతర్రాష్ట్ర సరిహద్దు గరికపాడు` చిల్లకల్లు బోర్డర్‌ చెక్‌పోస్టు, ముక్య్తాల, గండ్రాయి బోర్డర్‌ చెక్‌పోస్టులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా కార్యకలాపాలను పరిశీలించి, అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని 21 చెక్‌పోస్టులలో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లోపాలను సరిదిద్దుతున్నట్లు తెలిపారు. అధిక మొత్తంలో నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువుల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీస్‌, ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సిబ్బందితో పాటు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని కూడా చెక్‌పోస్టుల వద్ద మోహరించామన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేయడం జరుగుతుందని, నియమావళి ఉల్లంఘించకుండా 42 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని, అందుకు సంబంధించి సరైన ఆధారాలు ఉండాలని, లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగదు సీజర్స్‌ను పరిశీలనకు జిల్లాస్థాయి కమిటీ పనిచేస్తోందని, రూ. 10 లక్షలకు మించితే ఐటీకి సమాచారం ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ డా. పి.సంపత్‌ కుమార్‌ నందిగామ ఆర్‌వో ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట ఆర్‌వో జి.వెంకటేశ్వర్లు, ఎన్‌టీఆర్‌ జిల్లా ఏడీపీసీ, పోలీస్‌ నోడల్‌ అధికారి ఎం.కృష్ణమూర్తినాయుడు, రెవెన్యూ, ఎక్సైజ్‌, రవాణా తదితర శాఖల నోడల్‌ అధికారులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *