Breaking News

అవ్వాతాతలను ఇబ్బందిపెట్టి రాక్షసానందం పొందుతున్న చంద్రబాబు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవ్వాతాతలకు ఒకటో తేదీన పింఛన్ అందకుండా చేసి చంద్రబాబు అండ్ కో రాక్షస ఆనందం పొందుతున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పైగా ఏ ముఖం పెట్టుకుని ఎల్లో బ్యాచ్ సీఎస్ ను కలుస్తారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అవ్వాతాతలు, దివ్యాంగులు ఒకటో తేదీన వచ్చే పింఛన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారని మల్లాది విష్ణు అన్నారు. తెల్లవారుజాముకల్లా 95 శాతం పింఛన్ల పంపిణీ జరిగేదని.. కానీ ఈనెల ఇంకా జరగకపోవడానికి బాబు, అతని జేబు సంస్థలు ప్రధాన కారణమని ఆరోపించారు. ఓవైపు నిమ్మగడ్డ రమేష్ ద్వారా సామాజిక పింఛన్లను అడ్డుకుని.. మరోవైపు సకాలంలో ఇచ్చేయాలంటూ వర్ల రామయ్య, దేవినేని ఉమా సీఎస్ ను కలవడం బాబు డబుల్ స్టాండ్ కు అద్దం పడుతోందన్నారు. ఆనాడు మంత్రిగా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయని దేవినేని ఉమా కూడా సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని మల్లాది విష్ణు అన్నారు. మైలవరంలో ఎంతమంది పింఛన్ దారులు ఉన్నారో కూడా దేవినేని ఉమాకు తెలియదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక మైలవరం నియోజకవర్గంలో అక్షరాల 44,480 మందికి పింఛన్ల రూపంలో ప్రతినెలా రూ.3 వేలు చొప్పున అందిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అదే టీడీపీ హయాంలో కేవలం 31,983 మందికి మాత్రమే పింఛన్ అందేదని.. గతంతో పోలిస్తే దాదాపు 12 వేల మందికి అదనంగా పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాలే లేనట్లు ఐదేళ్లు నానా యాగీ చేసిన బాబు అండ్ కో.. ఇప్పుడు సచివాలయాల్లో 1.30 లక్షల ఉద్యోగులు ఉన్నట్లు లేఖలో పేర్కొనడంపై ఏం సమాధానమిస్తారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితులు మరలా ఎక్కడ వస్తాయేమోనన్న భయాందోళనలో అవ్వాతాతలు ఉన్నారని.. ఈసారి వారంతా ముందు నిలబడి తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించడం ఖాయమని స్పష్టం చేశారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *