ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆలయ ఈవో కె ఎస్ రామరావు దేవస్థానంనకు అనుబంధంగా ఉన్న పోరంకిలో ఉన్న స్మార్థ వేదపాఠశాలకు సోమవారం విచ్చేసి సంస్కృతభారతీ, ఆంధ్రప్రదేశ్ సంస్థ వారి చేత పాఠశాల లోని వేదవిధ్యార్థులకు సంస్కృతం లో సంభాషణ నేర్పుట కొరకు 10 రోజుల నీడివి గల “దశదిన సంస్కృత సంభాషణ శిబిరం” ను ప్రారంభించి, విద్యార్థులకు సంస్కృత భాష యొక్క ప్రామిఖ్యతను, అమ్మవారి సుప్రభాతం ను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంనకు సంస్కృత భారతీ ట్రస్ట్ కార్యదర్శి, సంచాలకులు డా.యూ వి రమణ మూర్తి మరియు సంస్కృత భారతీ ఆంధ్ర ప్రాంత బాలకేంద్ర ప్రముఖ్ అరుణ శ్రీ విచ్చేసి విద్యార్థులకు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత ను తెలియజేసి శిబిరం నందు తరగతులు ప్రారంభించడం జరిగినది. అనంతరం ఈవో సమక్షంలో విద్యార్థులకు వివిధ దశల సంస్కృత భాష పుస్తకములు, అమ్మవారి సుప్రభాతం పుస్తకములు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేదవిధ్యార్థులు ఉత్సాహముగా పాల్గొని, ఆసక్తి చూపించారు. ఈ కార్యక్రమంలో వేదపాఠశాల ప్రధానోపాధ్యాయులు షణ్ముఖేష శాస్త్రి మరియు ఉపాధ్యాయులు, ఆలయ ఈఈ లింగం రమ, డిఈఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …