రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కోసం – ఎన్నికల కమిషన్ అత్యంత విలువైన, అమూల్యమైన ఓటు హక్కును పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం.. సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్ళు , ఓటరు చిరునామా మార్పు, బదలీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ?
ఓటర్లు 2024 మే 13 న జరిగే పోలింగు రోజున ఓటు వేసేందుకు ఇదే చివరి అవకాశం… ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 19 వ సంవత్సరం లో వచ్చినట్లు ఐతే “ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ” లేదా “విఓటిఈఆర్ఎస్. ఈసిఐ. జీవోవి. ఇన్ ” లేదా సిఈవోఏఎఎన్ డీహెచ్ఆర్ఎ.ఎన్ఐసి. ఇన్ వెబ్ సైట్ ద్వారా కొత్తగా ఓటరు గా నమోదు ను ఫారం 6 ద్వారా చేసుకోవాలి. ప్రస్తుతం ఓటరుగా ఒక నియోజక వర్గం లో లేదా అదే నియోజక వర్గం లో వేరే ఇంటి చిరునామా లో ఓటరు గా ఉన్న వ్యక్తి తన చిరునామా మార్పు, ఓటు బదలీ కోసం ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
“voterheline” – App
“voters.eci.gov.in”
“ceoandhra.nic.in”