Breaking News

ఏప్రియల్ 3 నుంచి 6 వరకు పెన్షన్లు పంపిణీ

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ నెలల్లో సామాజిక భద్రత పెన్షన్‌లను సవరించిన విధానానికి సంబంధించి ఏప్రిల్ 3 నుంచి 6 వ తేదీ వరకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో, బ్యాంకర్ల తో కలెక్టర్ ఛాంబర్ నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా
పెన్షన్‌లను పంపిణీ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇంటింటికీ పంపిణీ కి సంభందించి విభిన్న వికలాంగ వర్గానికి చెందిన, తీవ్రమైన అనారోగ్యాల వర్గం కింద అనారోగ్యంతో ఉన్నవారు, మంచం పట్టిన వారికి, వీల్ చైర్లకు పరిమితమైన, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్దవీరుల వృద్ధ వితంతువులు, మానవతా సమస్యల దృష్ట్యాv అటువంటి వారి ఇంటి వద్దకే అందజేయాల్సి ఉంటుందన్నారు. పై వర్గాలకి చెందిన వారికీ కాకుండా మిగిలిన వారికి గ్రామ మరియు వార్డు సచివాలయాలలో పింఛన్ల పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. : పైన పేర్కొన్న అంశాలకు అనుగుణంగా, మిగిలిన పెన్షనర్లకు, గ్రామ/వార్డు సచివాలయాలు ద్వారా పంపిణీ చేయడానికి సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సేర్ప్ (SERP) మార్గదర్శకాల జారీ చేయడం జరిగిందన్నారు.

ఏప్రియల్ 3 వ తేదీ బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించి, ఉదయం 11 గంటల నుంచి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏప్రియల్ 4 వ తేదీ నుంచి గ్రామ & వార్డు సచివాలయాల పని గంటలు ప్రతిరోజు ఉదయం 7.00 నుండి రా.7.00 గంటల వరకు, పెన్షన్లు పూర్తిగా పంపిణీ చేయబడే వరకు సచి వాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విలేజ్ & వార్డు సెక్రటేరియట్‌లలో తగిన సిబ్బంది మరియు సామగ్రిని అందుబాటు లో ఉంచాలి. పింఛనుదారుల కోసం తగిన నీడ, సీటింగ్ , త్రాగునీటికి అవసరమైన ఏర్పాట్లు చేయడం , అసౌకర్యం కలగకుండా చూసుకోవడం కోసం సంబంధిత గ్రామ పంచాయతీలు బాధ్యత వహించాలి. జిల్లాలో సుమారు 2,43,000 మంది పెన్షన్ పంపిణీ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని స్పష్టం చేశారు.

సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ వివరాలూ ప్రజలకి తెలియ చెయ్యాలి. ఎంపీడివో లు , మున్సిపల్ కమీషనర్లు బ్యాంకుల నుంచి డబ్బు ఉపసంహరించ డానికి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు సంక్షేమ అభివృద్ధి సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శి & సంక్షేమ & విద్య సహాయకుల ద్వారా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 లోగా పెన్షన్ పంపిణీ పూర్తీ చెయ్యాల్సి ఉంటుందన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *