గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులకు ఎన్నికల సరళిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు పరిష్కారం చేసేలా మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ అందించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన రూట్, సెక్టోరల్ అధికారులకు ఈవిఎంల నిర్వహణపై డెమో ఈవిఎంల ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవిఎంలు, వివి ప్యాట్ ల పని తీరుపై సెక్టోరల్, రూట్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలన్నారు. ప్రధానంగా ఈవిఎంలు, వివి ప్యాట్లు కమిషనింగ్, పోల్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం చేసేలా మాస్టర్ ట్రైనర్లు శిక్షణ అందించాలన్నారు. ట్రైనర్లు ప్రాక్టికల్ గా డెమో ఈవియంల ద్వారా వివరించాలన్నారు. ఈవిఎంల పై గత కొన్ని రోజులుగా శిక్షణ అందించినప్పటికీ శిక్షణలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాకపోవడంపై రూట్ ఆఫీసర్లు మణి కంఠ, సునీతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను మరొకసారి చెక్ చేసుకోవాలని, ఓటర్ల సంఖ్య, కేంద్రాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బుధవారం నుండి రోజుకొక సెక్టోరల్ అధికారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు లేదా బిఎల్ఓలు ఎవరు సహకరించక పోయినా రిపోర్ట్ ఇస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శిక్షణలో ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, సెక్టోరల్ అధికారి శ్రీధర్, ఎస్.ఈ. శ్యాం సుందర్, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్, సెక్టోరల్, రూట్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …