గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బి.యల్.ఓ లు శనివారం సాయంత్రానికి తమ వద్ద ఉన్న క్లెయిమ్ లను ఎలక్షన్ సెల్ ల్లో అందించాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కె. రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక లాడ్జ్ సెంటర్ లోని ఏ.యల్ బి.ఈ.డి కళాశాలలో బిఎల్ఓలు, సూపర్వైజర్లు, సెక్టార్, అధికారులతో ఎన్నికల విధులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల విధులు కేటాయించబడిన వారు విధుల్లో ఒకరికొకరు సమన్వయంతో పని చేయాలన్నారు. సెక్టార్ అధికారులతో సమన్వయం చేసుకోకుండా, ఫోన్ కాల్స్ కి రెస్పాండ్ అవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే బి.యల్.ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎన్నికల విభాగ సూపరిండెంట్ ను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఫారం-6 క్లైమ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో శనివారం సాయంత్రానికి సబ్మిట్ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు (ర్యాంపులు, బాత్ రూమ్ లు, కరెంట్, త్రాగు నీరు, రూఫ్ లు, ఫ్లోరింగ్, కుర్చీలు, బల్లలు) ఏర్పాటు చేయాలని, సదుపాయాల కల్పనలో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సెక్టార్ అధికారుల ద్వారా ఇంజినీరింగ్ అధికారులకు తెలియచేయాలన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో బి.యల్.ఓ లు ఎన్నికల కేంద్రం వద్దనే, ఎన్నికల విధుల గుర్తింపు కార్డుతో ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ఎవరైనా విధుల యందు నిర్లక్ష్యం వహించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బిఎల్ఓలు తమ పరిధిలోని ఓటర్లందరూ ఓటింగ్ లో పాల్గొనేలా అవగాహన చేపట్టాలని, గత ఎన్నికల్లో పోలింగ్ శాతంకి మించి పోలింగ్ జరిగేలా భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో ఏఆర్ఓలు సి.హెచ్ శ్రీనివాస్, నిరంజన్, ఎన్.శ్రీనివాస్, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ, సెక్టార్, రూట్ అధికారులు, సూపర్వైజర్లు, బిఎల్ఓలు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …