Breaking News

విశాఖలో పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలో మాధవధార మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు అకస్మిక తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో మన బడి: నాడు- నేడు పనుల తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న సివిల్ వర్క్స్ బిల్లును ఈఈకి విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి లాబొరేటరీ, లైబ్రరీని సిద్ధం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ మెటీరియల్, శానిటరీ నాప్‌కిన్‌ల స్టాక్‌లను తనిఖీ చేసారు. నాప్‌కిన్‌ల నాణ్యత గురించి బాలికల నుండి అభిప్రాయాలు సేకరించాలని హెచ్‌ఎంను కోరారు. పాఠశాలకు చెందిన ఆస్తులు, రాత్రిపూట భద్రత గురించి వాచ్‌మెన్‌తో సంభాషించారు. ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు వెంట విశాఖపట్నం డీఈవో ఎల్. చంద్రకళ, ఈఈ పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *