Breaking News

విభిన్న ప్రతిభావంతులు అవరోధ రహితంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకువడానికి వసతుల ఏర్పాటు : డి ఆర్ ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు సైతం తమ ఓటుహక్కును అవరోధ రహితంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని డి ఆర్ ఓ ఛాంబర్ నందు డి ఆర్ ఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు హోమ్ ఓటింగ్ కు అవరోధ రహిత ఓటింగ్ ఏర్పాట్ల పై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా లోని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్దులు సైతం సార్వత్రిక ఎన్నికలు-2024 సందర్భంగా తమ ఓటు హక్కును అవరోధ రహితంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ర్యాoప్ లు, రైలింగ్, వీల్ చైర్లు, అంధులకు బ్రెయిలీ బ్యాలెట్ పేపర్లు మొదలగు సదుపాయాలు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకువడానికి తగిన రవాణా సదుపాయానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి ఏ.వై.శ్రీనివాస్, మెప్మా పిడి రాధమ్మ, డి ఎం అండ్ హెచ్ ఓ శ్రీహరి, డి సి హెచ్ ఎస్ ఆనందమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *