విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2024 కు సంబంధించి సమాజ్ వాదీ పార్టీ మేనిఫెస్టో ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి నోచుకోకుండా భాదలు పడుతున్న ఆంధ్రప్రదేశ్లోని 85 శాతం ప్రజలలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ప్రజల ఆందోళన, ఆక్రందనలకు, ఆకాంక్షలకు ప్రతిబింబం, ప్రతిస్పందన సమాజ్వాదీ పార్టీ మేనిఫేస్టో అని అభివర్ణించారు. అనంతరం 38 మంది సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తొలి జాబితాలో ఎస్సి-15, బీసీ-11, ఓసీ-11, ఎస్టీ-1 కేటాయించినట్లు తెలిపారు. పార్టీ జాతీయ కార్యదర్శి జగదీష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే ఏకైక సోషలిస్ట్ పార్టీ సమాజ్ వాదీ పార్టీ అన్నారు. ఈ రాష్ట్రంలో డబ్బున్న వారికే సీట్లు కేటాయిస్తున్నారని, వందల కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కానీ మా పార్టీ సామాన్య వ్యక్తులకు కేటాయించినట్లు తెలిపారు. దేశంలో మోడీ అరాచకాలను, బడుగు బలహీన వర్గాల పై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఆయా వర్గాల ప్రజలకు రాజ్యాధికారం లో బాగస్వామ్యమే పరిష్కారమన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ పంపు గుర్తు పై ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …