Breaking News

విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ 
-ముగిసిన సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక శిక్షణా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వెయ్యి పాఠశాలలకు సీబీఎస్ఈ అనుమతి పొందడం గొప్ప విషయమని, ఇదొక సదావకాశంగా భావించి ఉపాధ్యాయులంతా అంకితభావంతో పని చేస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని, విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు.
విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణంలో ‘సీబీఎస్ఈ 9,10 తరగతుల నిర్మాణాత్మక బోధనా శాస్త్ర పాఠ్య ప్రణాళిక’ రూపకల్పన కోసం జిల్లా రిసోర్సు పర్సన్లకు ఏర్పాటు చేసిన రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆసక్తికరంగా చదవాలంటే తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువ బాధ్యత వహించాలని కోరారు. సీబీఎస్ఈ సిలబస్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంలో క్రిస్ప్ (CRISP) సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అనంతరం సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఉపాధ్యాయులు తరగతిలోకి వెళ్లేముందు ప్రతి పాఠ్యాంశ ప్రణాళిక సోపానక్రమంలో రాసుకుని ఆకళింపు చేసుకోవాలని అన్నారు. తద్వారా విద్యార్థులకు పాఠాలు సులభతరంగా అర్థమవ్వడమే కాకుండా మనసులో ముద్ర పడిపోతాయని, నాణ్యమైన విద్యను అందించినవారమవుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో Centre for Research in Schemes and Policies (CRISP) సభ్యులు  కె.సంధ్యారాణి (Rtd IPos), స్టేట్ లీడ్ పి.ఉషారాణి (Rtd IAS.), ఏపీ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి , అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు జుబిమోల్ జె, గోమతి సౌందర్‌రాజ్, నందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *