Breaking News

సుజనా చౌదరి వంటి వారిని ఓడించి ఈ ప్రాంతంలో రాజకీయ పరిణితి తెలియజేయాలి… : పోతిన మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన మహేష్ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
పెత్తందారులు తలుచుకుంటే మాలాంటి వాళ్ల జీవితాలు గల్లంతవుతాయని పెత్తందారులు పూనుకుంటే ఏళ్ల తరబడి పడిన శ్రమ ఆవిరైపోతుందని కాళ్లు కింద పెట్టి ప్రజలు బాధలు తెలుసుకోలేని వాళ్ళు నలుగురికి బాసటగా నిలబడ లేని వాళ్ళు ఈ రోజున మోసం చేసి బ్యాంకులు కొల్లగొట్టి డబ్బులు దోచేసి మన మీద మన ఉనికి మీద యుద్ధం చేస్తున్నారనే విషయాన్ని నగరాల సామాజిక వర్గం వారు గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నానని నేను ఈ ప్రాంతంలో బలంగా ఎదగడానికి నగరాల సామాజిక వర్గ వారు నా వెనుక బలంగా వెన్నెముకలాగా నిలబడ్డారని ఈ పది ఏళ్ల పోరాటంలో మన వాడికి కచ్ఛితంగా మంచి స్థానం వస్తుంది తద్వారా మన కులం వాడికి అసెంబ్లీలో స్థానం దొరుకుతుందనే ఆశతో నా బాధలో నా కష్టసుఖాల్లో వారు కూడా భాగస్వాములు అయి ఎల్లవేళలా నాకు అండగా నిలిచారని నాతో పాటు వారు కూడా ఇబ్బంది పడ్డారు నా ఈ పోరాటానికి విలువ వుంటుంది అనుకున్నారు కాని రాత్రికి రాత్రి ఢిల్లీ నుంచి ఊడిపడ్డ సుజనా చౌదరి అతని యొక్క లాబీయింగ్ ముందు మా ఆశలన్నీ ఆవిరి అయిపోయాయని అసలు ఎవరి ఈ సుజనా చౌదరి ఇక్కడి వాడ పోనీ ఇక్కడ వారి కోసం ఏనాడైనా పనిచేశాడా 20,30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడని చెప్పుకుంటూ కనీసం ఒక్క వార్డ్ మెంబర్ గా కూడా పోటీ చేయకుండా పదవులు అనుభవిస్తు వాటిని అడ్డం పెట్టుకుంటూ బ్యాంకుల్ని మోసం చేస్తూ డబ్బులు దోచేస్తూ అవకాశాన్ని బట్టి కేసులు బట్టి పార్టీలను మారుస్తూ లాబీయింగ్ చేస్తూ టికెట్ తెచ్చుకుని ప్రజలతో సంబంధం లేనటువంటి రాజకీయ నాయకుడే ఈ సృజన చౌదరి నేను ప్రజలతో కలిసి నిలబడ్డ కానీ పవన్ కళ్యాణ్  చంద్రబాబు నాయుడు ఇట్లాంటి సుజనా చౌదరి లాంటి వ్యక్తి కోసం నిలబడ్డారని వారికి ప్రజలకి పనికొచ్చే నాలాంటి మనిషి అక్కర్లేదని వాళ్లకి పనికొచ్చే వ్యక్తి వాళ్లకి లబ్ది చేకూర్చే వ్యక్తి కోసమే నిలబడతారు కానీ ప్రజల కోసం నిలబడి సమయాన్ని డబ్బుని వృధా చేసుకున్నటటువంటి నాలాంటి వ్యక్తుల్ని బలపరచకుండా కేవలం అతని డబ్బు మదాన్ని, ఇతరుల అవకాశాన్ని కొల్లగొట్టే అతని నైజాన్ని జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకుని నాలాంటి వ్యక్తుల అవకాశాన్ని లాగేసుకున్నారని అటువంటి వ్యక్తులని మేము బలపరచాలా మేము పేదలవైపు ఉండాలా పెత్తందారుల వైపు ఉండాలా సామాన్యమైన వ్యక్తి ఆసిఫ్ వైపు మేము నిలబడాలా పెట్టుబడిదారుడు పెత్తందారుడైనటువంటి సుజనా చౌదరి వైపు నిలబడాలా పశ్చిమ నియోజకవర్గం లో అత్యధికంగా పేద సామాన్య వర్గ ప్రజలే నివాసం ఉంటారని పశ్చిమ నియోజకవర్గం లో పేదవారి వైపు నిలబడితేనే వారికి మేలు జరుగుతుంది కానీ పెత్తందారుల వైపు నిలబడితే ప్రజలకి మేలు జరుగుతుందా దీని మీద ప్రజలతోపాటు నగరాల సామాజిక వర్గం కూడా కచ్చితంగా ఆలోచన చేయాలని 40 సంవత్సరాల తర్వాత మనకు వచ్చిన గొప్ప అవకాశాన్ని, అసెంబ్లీలో కాలు పెట్టే అవకాశాన్నిలాగేసుకున్నటువంటి వ్యక్తికి మనం అండగా నిలబడాలా దీని మీద నగరాలు కచ్చితంగా బలమైన ఆలోచన చేయాలని టిడిపి జనసేన బ్రోకర్లును నా ఇంటికి పంపించినప్పుడు నేను వారిని తిరస్కరించానని దీనికి గల కారణం నాతోపాటు నా సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసమేనని అందరూ కూడా ఆలోచన చేయాలని కానీ కొంతమంది చిల్లర కోసం ఇదే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న విషయాన్ని అందరూ కూడా గమనించాలని తమ సామాజిక వర్గ ప్రయోజనాల కన్నా ఆత్మగౌరవంకన్నా సృజన చౌదరి విదిలించే చిల్లరకే ఎక్కువ విలువ ఉంటుందని కొంతమంది నగరాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నిరూపిస్తున్నారని దీన్ని నగరాల సామాజిక వర్గ వారు గుర్తించి వారిని బలంగా తిరస్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నానని వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నగరాల సామాజిక వర్గానికి దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారని నగరాలకి మేయర్ పదవి మరియు శ్రీశైలం దేవస్థానంలో 50 సెంట్లు భూమి ఇచ్చారని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నగరాల సామాజివర్గానికి బీసీ గుర్తింపు ఇచ్చారని నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు దేవస్థానంలో నగరాల సామాజిక వర్గానికి పదవులు ఇచ్చారని ఇవన్నీ గుర్తించి గౌరవించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని రాత్రికి రాత్రి సుజనా చౌదరి అనే వ్యక్తి వచ్చి మనకి వచ్చిన అవకాశాన్ని లాగేసుకున్నారని అటువంటి వ్యక్తులకి మనం సహకరించాలా లేక మన నగరాల సామాజిక వర్గాన్ని గుర్తించి అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలా ఒక్కసారి నగరాల సామాజిక వర్గం వారు బలంగా ఆలోచన చేయాలని జనసేన పార్టీతో నా ప్రయాణం టిడిపిని దగ్గర నుంచి చూసిన తర్వాత రెండు పార్టీల మీద నమ్మకం పోయిందని తడి గుడ్డతో గొంతు కోసిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులతో ప్రయాణం ప్రమాదమని తెలిసిపోయిందని వైసీపీ పార్టీలో పోరాడిన వాళ్లకు ప్రజలతో ఉన్నవాళ్లకి ఇచ్చే విలువ ఎంతోమంది నాయకుల రూపంలో కనిపిస్తూనే ఉందని దశాబ్దం కాలం కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని పూచిక పుల్లతో తీసేసిన వారి పార్టీలో ఉండడం కన్నా మన పోరాటాన్ని గుర్తించి సముచిత స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం సమచితం గౌరవం అని భావించానని నేను వైసిపి పార్టీలో చేరిన నాలుగు రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్నప్పుడు నన్ను ప్రేమగా బస్సులోకి ఆహ్వానించారని అక్కడితో ఆగకుండా విజయవాడ నగరంలో సిద్ధం బస్సు యాత్రలో విజయవాడ నగర నాయకులతో పాటు నన్ను కూడా నిలబెట్టారని అది అతని యొక్క గొప్పతనం అని అటువంటి అభిమానం చూపించినటువంటి నాయకులు వెంట నడవడం చాలా గొప్ప గౌరవమని మనం ఖచ్చితంగా కష్టపడి ఒక సామాన్యుడు వెంట నిలబడి పశ్చిమ నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్నీ గెలిపించాలని ఆదే విధంగా మనతో మన ప్రాంతంతో మన జీవితాలతో సంబంధం లేకుండా ఊడిపడి మన అవకాశాన్ని లాగేసుకున్న సుజనా చౌదరిని ఓడించి ఈ ప్రాంతంలో మన రాజకీయ పరిణితిని చాటుకోవాలని ఆ విషయాన్ని సుజనా చౌదరి లాంటి వ్యక్తులకు తెలియజేయాలని ఎన్నికల అయిన తర్వాత బురిడీ కొట్టించడం అనేది సుజనా చౌదరికి సామాన్యమైన విషయం అనే విషయాన్ని గుర్తించాలని మీకోసం ఇన్నాళ్ళు నిలబడింది ఈ పోతిన మహేష్ అని నన్ను మీరందరూ కూడా గుర్తించాలని మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో పోతిని సాంబ, ఈడి పిల్లి పవన్, వివర నాగేశ్వరరావు , పైడిపాటి మురళి, పొట్నూరి శ్రీనివాసరావు, పొట్నూరి కిషోర్, శ్రీరామ్ శీను బాబు, పిల్ల శంకర్, పైలా పవన్, సుఖాసి భాను, గంగాధర్, మరి పిల్ల చిన్నారావు, మొదిలి ప్రసన్నకుమార్, రామ్ పిల్ల చరణ్, పోతిన యుగంధర్, సోసుపల్లి నాని, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *