చైన్నె, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును ప్రతి ఓటరూ వినియోగించుకోవాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ (నేటి గాంధీ) పిలుపునిచ్చారు. శుక్రవారం చైన్నెలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ తాను పుట్టింది ఆంధ్రా అయితే… పెరిగింది తమిళనాడు అని అన్నారు. అందుకే ఇప్పటికీ ఎక్కడవున్నా కూడా ఓటువేసే సమయంలో తమిళనాడులోనే గుర్తుగా ఓటు వేస్తున్నానన్నారు. ఎన్నికలలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడే వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం అవసరమన్నారు. వ్యక్తికి, వ్యక్తిత్వానికి విలువనిస్తూ తగిన వ్యక్తులను ప్రజా ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకోవడం ముఖ్యమని ఆయన చెప్పారు. దేశంలో మహిళలకి సంపూర్ణ రక్షణ, స్వేచ్ఛ లభించిన నాడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Tags chennai
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …