ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రదోషకాలంలో ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆధ్వర్యంలో గురువారం మంగళ వాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ వైదిక అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించుచూ శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులతో శాస్త్రోక్తముగా ద్వాదశ(12) ప్రదక్షిణలు ద్వాదశ అంశములతో (1. పంచమహా వాద్యము, 2.వేదపటనము, 3.రుద్రసూక్తము, 4.స్తోత్ర పఠనం, 5.భేరి, 6.కాహాలకము(కొమ్ము బూర), 7.కాంస్య నాదం,8.వీణా నాదం, 9.మురళీ నాదం, 10.గానము, 11.నృత్యం మరియు 12.మౌనం) ప్రదక్షిణములు వేదపండితులు ప్రతి అంశం యొక్క ప్రాముఖ్యత తెలియజేయుచూ, సదరు అంశముతో స్వామి,అమ్మవార్లను స్మరిస్తూ ద్వాదశ ప్రదక్షిణలు ద్వాదశ విధ అంశములతో అత్యంత వైభవంగా నిర్వహించడమైనది. అనంతరం అద్దాల మండపము నందు పవళింపు సేవ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమముల నందు ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు దంపతులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు, అర్చక మరియు ఇతర సిబ్బంది మరియు భక్తులు విశేషముగా పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …