విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో 11 మంది నేతల బృందం శుక్రవారం రాజ్ భవన్లో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. 13 అంశాలపై గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్బీఐ జాబితా ప్రకారం తెచ్చిన మొత్తం అప్పులు, గుత్తే దారులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఆస్తుల వివరాలు ప్రకటించాలని కోరుతూ వినతిపత్రమి చ్చారు. గవర్నర్ తో భేటీ అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. “వైకాపా ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డ గోలుగా అప్పులు తెచ్చింది. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్లు, గుత్తేదారులకు బిల్లులు కూడా ఇవ్వలేదు. కేంద్రం గ్రామీణాభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులను దారి మళ్లించారు. మద్యంపై భవిష్యత్లో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగే హక్కు గవర్నర్కు ఉంది. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల వివరాలు కావాలని కోరాం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా నచ్చిన వచ్చిన వారికి ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించారు” అని పురందేశ్వరి ఆరోపించారు. గవర్నర్ ని కలసి న వారి లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి లు యామినీ శర్మ, ఆర్ డి విల్సన్ బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిజెపి సీనియర్ నేత కిలారు దిలీప్, జగదీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం …