-వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా
-మంత్రి కందుల దుర్గేష్
పెరవల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ పోషణ కొరకు సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లిన మన నియోజకవర్గ వాసులు మీసాల ఈశ్వరరావు, మొల్లేటి సత్యనారాయణ అగ్ని ప్రమాదానికి గురై మరణించడం చాలా బాధాకరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
శనివారం మంత్రి కందుల దుర్గేష్ పెరవల్లి మండలం అన్నవరప్పాడు, ఖండవల్లి గ్రామాలకు వెళ్లి ఇటీవల కువైట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం లో మరణించిన వారికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూమన నియోజకవర్గ వాసులు మీసాల ఈశ్వరరావు, మొల్లేటి సత్యనారాయణ కువైట్ లో అగ్ని ప్రమాదానికి గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేవనే ఆలోచనతో సుదీర ప్రాంతమైన కువైట్ కు వెళ్లి కష్టపడే పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారన్నారు. ఇటువంటి తరుణంలో చిన్న వయసులోనే మరణించడం బాధాకరమన్నారు. ఇంకా వారి పిల్లల కూడా స్థిరపడలేని చిన్న వయసు గల వారన్నారు. వారి కుటుంబాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు.కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ లోటును తీర్చలేనిదని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున వెంటనే స్పందించి మరణించిన ఈ రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ప్రకటించిన ఎక్స గ్రెషియాను ఒక్కొక్కరికి రు.5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరో కొంత ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయమే కాకుండా వారి కుటుంబాలను నిలదొక్కుకునే విధంగా తరువాత రోజుల్లో కూడా తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. ఆ రెండు కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఇంచార్జ్ సబ్ కలెక్టర్ ఆర్. కృష్ణనాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.