-ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం గా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తోంది
-డయేరియా ప్రభలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది
-కోటిలింగాల రేవు సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజలకు సూచనలు ఇస్తున్న శాసనసభ్యులు
-డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి
-అవసరం మేరకు వైద్యుని సంప్రదించి మందులు వాడాలి
-రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఏ ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు ) అన్నారు.
మంగళవారం నగరంలోని కోటిలింగాల పరిసర ప్రాంతాలను శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారులు సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కోటిలింగాల రేవు సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డయేరియా ప్రభలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డయేరియా వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడం మనం గమనిస్తున్నామన్నాసారు. ఇది గమనించి రాజమండ్రి నగరంలో ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం వారికి తగు జాగ్రత్తలు సూచనలు అందించడంతోపాటు జింక్, ఓఆర్ఎస్ మందులు అందించడం జరుగుతుందన్నారు. డయేరియా నియంత్రణ పట్ల నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కోటిలింగాల రేవు అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారులు వైద్య సిబ్బందితో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వచ్చి చల్లార్చిన నీటిని త్రాగాలని, మరి ముఖ్యంగా ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోవడం పరిశుభ్రమైన ప్రాంతంలో ఉండే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే అర్బన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవడం వలన నగరంలో చాలా తక్కువ లో తక్కువ కేసులు నమోదు కావటం వారికి వైద్యులు సకాలంలో వైద్యం చేయటం అరికట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం గా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని ఆ దిశగా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని శాసనసభ్యులు పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ మురుగునీరు నిలవ లేకుండా మెరుగైన శానిటేషన్ చేస్తున్నామన్నారు. నగర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిరంతరం ప్రజలతో మేమేకమై పనిచేయడం జరుగుతుందని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్నలక్ష్మి, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్న, హెల్త్ సూపర్వైజర్ ఎస్ విజయ కుమారి, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.