-ఎస్ డబ్ల్యూ పీ ఎస్ డప్పింగ్ యార్డుల్లా కాకుండా సంపద సృష్టి కేంద్రాలుగా మారాలి
-పనిచేయ్యని 66 ఎస్ డబ్ల్యూ పీ ఎస్ ద్వారా కార్యకలాపాలు పనిచేయాలి
-పారిశుధ్యం.. త్రాగునీరు ఫిర్యాదు కోసం 1800-233-0544 టోల్ ఫ్రీ నెంబర్
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆగస్టు 9 నుంచీ 13 వరకూ ఇంటింటా జల్ జీవన్ మిషన్ సర్వే చేపట్టి ప్రతి ఇంటికి అందచేస్తున్న త్రాగునీరు సరఫరా, ట్యాప్ కనెక్షన్, వాహనాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్న నీరు సక్రమంగా అందుతున్నాదా లేదా వంటి సమగ్ర సమాచారం సేకరణ చెయ్యాల్సి ఉందన్నారు. ఈ సర్వే తో అనుగుణంగా శానిటేషన్ సర్వే కూడా సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం శానిటేషన్ నిర్వహణా తీరును రెండూ గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్ డబ్ల్యూ పీ ఎస్ షెడ్స్ నూరు శాతం పనిచేసేలా ఎంపిడిఓ లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 66 చోట్ల ఎస్ డబ్ల్యూ పీ ఎస్ షేడ్స్ పనిచెయ్యడం లేదని, తక్షణం అవి పనిచేసేలా చూడాలన్నారు. పెండింగ్ పన్నుల బకాయిలు వసూలు చేయాలన్నారు. ట్యాక్స్ కనెక్షన్లు మరింత వేగవంతం చేయాలని, పన్నులు ఆస్తులపై వెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. పన్నుల విధానం ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఘన వ్యర్థాల నుంచి సంపద సృష్టి కేంద్రాలు డప్పింగ్ యార్డ్ కాదని, అక్కడ పారిశుధ్యం నిర్వహణ వ్యవస్థ లేకపోవడం గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి ఏ ముఖలింగం, డిపిఓ డి రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి డి బాలశంకర రావు, డిఆర్డిఏ పిడి ఎంవీవిఎస్ మూర్తి, డివిజనల్ పంచాయతీ అధికారి నాగలత, తదితరులు పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లు అందరికీ వివరముగా 21వ పశుగణన ఆప్ పై పూర్తి అవగాహన కల్పిస్తూ సమగ్ర శిక్షణ ఇచ్చారు.