రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధి లో ఉన్న పోలీసు అధికార్లు, రెవెన్యూ అధికార్లు, పంచాయితీ రాజ్ అధికార్లు, గవర్నమెంట్ ప్లీడర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ లాయర్ల తో జిల్లా కోర్టు కార్యాలయంలోని ఛాంబర్ సమావేశం నిర్వహించారు.
సెప్టెంబర్ 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో రాజీ యోగ్యమైన అన్ని సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, భూవివాదాలు, ఆస్తి వివాదాలు, రెవెన్యూ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఎక్కువ కేసులు పరిష్కరించుకొనేందుకు ఈ జాతీయ లోక్అదాలత్ ను వినియోగించు కోవాలన్నారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న రెవెన్యూ కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలన్నారు.
ఈ సమావేశం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు, కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బి. కృష్ణ రావు , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధి లో ఉన్న పోలీసు అధికార్లు, రెవెన్యూ అధికార్లు, పంచాయితీ రాజ్ అధికార్లు, గవర్నమెంట్ ప్లీడర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ లాయర్ల తదితరులు పాల్గొన్నారు.