Breaking News

నూతన పరిశ్రమల పాలసీ 2024-29 పై సమీక్ష

-కలవ చెర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిశీలన
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బొగ్గు వినియోగిస్తున్న పరిశ్రమలకు బొగ్గును క్రమబద్ధీకరించిన నిర్దేశించిన ధరలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన పారిశ్రామిక విధానం 2024-29 రూపకల్పన కొరకు ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాట్లు , ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ జిల్లాస్థాయి సమావేశంకు కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి సంబంధించి, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఇంక్యుబేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) మరియు సమాఖ్యలను ప్రోత్సహించి, ప్రధాన ఆహార పరిశ్రమల కోసం స్థానిక సూక్ష్మ , చిన్న మధ్య తరహా పరిశ్రమల నుండి ముడిసరుకు లభ్యత అందుబాటులో వుండాలన్నారు. స్థానిక వ్యవసాయ మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలతో భారత ప్రభుత్వం క్రింద ఉన్న ఎగుమతి ప్రోత్సాహక మండలి, కమిటీ బోర్డులతో అనుసంధానం అవసరమన్నారు. ఈ సందర్బంగా కమిటి సభ్యులు, పారిశ్రామిక సంఘాల అధ్యక్షులు మరియు పారిశ్రామిక వేత్తలు వారి సూచనలు, సలహలు అందించడానికి హజరు కాగా, జిల్లా పరిశ్రమల అధికారి జి.రవిశంఖర్ ఈ సమవేశంలో చర్చించవలసిన అంశాలను వివరించారు.

ఈ సమావేశంలో సభ్యులు ప్రస్తుత విధానంలో వున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై, ప్రభుత్వ పరంగా అందచెయ్యాల్సిన సహకారం పై చర్చించారు. వాటిలో ముఖ్యంగా APIIC ప్లాట్లలో పరిశ్రమలు నెలకోల్పి వారికి రుణలభ్యత, ఆహరశుద్ధి పరిశ్రమల సమస్యలు, సిరామిక్ పరిశ్రమలకు నిరంతరాయంగా సబ్సిడి రేట్లలో బోగ్గు సరఫరా మరియు పరిశ్రమల స్థాపనకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలు అనుమతుల కోసం రుడా (RUDA) బిల్గిండ్ ప్లాన్ అనుమతి – ఫీజులు తగ్గించడం వంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకు రావడం జరిగింది. అంతకు ముందు రాజానగరం మండలం కలవచేర్ల ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ప్రాంతాన్ని పర్యటించి, అక్కడ అమలు చేస్తున్న మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమనికి జిల్లా పరిశ్రమల అధికారి జి. రవి శంకర్, సహయ సంచాలకులు పి.ప్రదిప్ కుమార్, తదితరులు పాల్గోన్నారు .

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *