-దేవరపల్లి, మారేడుమిల్లి ఘటనల్లో ఇప్పటికే అధికారుల సస్పెండ్..
-నిష్పక్షపాతంగా విచారణ.. తుది నివేదిక రాగానే చర్యలు..
-చిరంజీవ్ చౌదరి, ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అటవీశాఖపై మీడియాలో వస్తున్న వార్తలకు ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవ్ చౌదరి స్పందించారు. 22.02.2024న PCCF & HOFF జారీ చేసిన సూచనల ప్రకారం, DFO, ఫ్లయింగ్ స్క్వాడ్, రాజమండ్రి వారు తన బృందంతో కలిసి 28.02.2024 నుండి 07.03.2024 వరకు రంపచోడవరం డివిజన్ లో నిర్దిష్ట క్షేత్ర తనిఖీలు నిర్వహించారని తెలిపారు. వారి తనిఖీలలో రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో టేకు, వివిధ రకాల చెట్ల నరికివేతలను బృందం గుర్తించడమైందన్నారు.
దీనిపై విచారణ కోసం మంగళగిరి-డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, గుంటూరు-డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, విశాఖపట్నం-డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ లతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ బృందాలు రంపచోడవరం డివిజన్ లో క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రధానంగా రెండు బీట్లలో అంటే దేవరపల్లి మరియు మారేడుమిల్లి సౌత్‌లో విధ్వంసం జరిగిందని, రూ.61 లక్షల విలువైన 413 చెట్లను దుండగులు నరికివేసినట్లు గుర్తించారన్నారు. విచారణ బృందాల నివేదిక ఆధారంగా స్టంప్ సైట్ వద్ద ఉన్న టేకు కలపను జప్తు చేసి, దానిని ప్రభుత్వ కలప డిపోకు రవాణా చేయాలని సిసిఎఫ్ రాజమండ్రి వారిని ఆదేశించడం జరిగిందన్నారు. మిస్ అయిన మెటీరియల్ ను తిరిగి రికవరీ చేయాలని, తప్పు చేసిన అధికారులపై చర్యలకు ఆదేశించడం జరిగిందన్నారు.
అలాగే, డిఎఫ్ఓ రంపచోడవరం వారి వివరణ కూడా కోరగా (మెమో) వారు తన తన సమాధానాన్ని సమర్పించారని ఆయన సమర్పించిన వివరణ పరిశీలనలో ఉందన్నారు. అంతేకాకుండా రంపచోడవరం డిఎఫ్ఓ రెండు నెలలుగా సెలవులో ఉన్నారని 01.07.2024 నుండి రంపచోడవరం డివిజన్ బాధ్యతను డీఎఫ్ఓ చింతూరు డివిజన్ వారు అదనపు బాధ్యతలుగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
వీటితోపాటు.. అడవుల విధ్వంసాన్ని గుర్తించడంలో విఫలమైనందుకు రంపచోడవరం రేంజ్ అధికారిని సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యల నిమిత్తం ఏవోసీ జారీ చేయడం జరిగిందన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుండి ఇచ్చిన ఛార్జ్ షీట్ కు వివరణను పొందిన తరువాత, సీసీఏ రూల్స్ అనుసరించి, నెలన్నర తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగిందన్నారు. సస్పెన్షన్ అనేది APCCA రూల్స్ 1991 ప్రకారం శిక్ష కాదు మరియు సస్పెన్షన్ యొక్క ఉద్దేశ్యం ఆ అధికారిని ప్రభావితం చేసే స్థితిలో లేకుండా, దూరంగా ఉంచి నిష్పాక్షిక పద్ధతిలో దర్యాప్తును పూర్తి చేయుట అని తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ అధికారిని తిరిగి విధుల్లోకి తీసుకున్న తర్వాత వారిని చింతూరు డివిజన్ లోని చింతూరు రేంజ్ లో నియమించారన్నారు.
అలాగే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాజమండ్రి మరియు/DFO, కాకినాడ వారు, దిగువ సిబ్బందిని అంటే (1) Dy.RO. (1)FSO & (2)FBOలను అడవుల విధ్వంసాన్ని గుర్తించడంలో విఫలమైనందుకు సస్పెండ్ చేశారన్నారు. నరికివేతకు సంబంధించి UDOR కేసులు బుక్ చేయబడ్డాయని, మెటీరియల్ ను రాజమహేంద్రవరం ప్రభుత్వ కలప డిపోకు తరలించడం జరిగిందన్నారు. అందిన రిపోర్టుల ప్రకారం, అన్ని మెటీరియల్స్ ను నివృత్తి చేశారన్నారు.
దీంతోపాటు, 2022-23 మరియు 2023-24 మధ్యకాలంలో జరిగిన CBET పనులల్లో బరిగిన అవకతవకలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు DFO, స్టేట్ విజిలెన్స్ & DFO FSP, విశాఖపట్నం వారితో 30.05.2024న ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ ప్రత్యేక బృందం నుండి తుది నివేదిక అందిన తర్వాత తదుపరి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిరంజీవ్ చౌదరి ప్రకటనలో స్పష్టం చేశారు.