Breaking News

వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సిఎం నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సమీక్ష చేశారు. సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమై బాధిత ప్రాంత ప్రజలకు వివిధ ప్రైవేటు సంస్థలు అందించే సేవల విషయంలో ప్రోగ్రెస్ ను రివ్యూ చేశారు. బ్యాంకర్లు, భీమా ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ సంస్థల యాజమాన్యాలు, వారి సర్వీస్ సెంటర్ల ప్రతినిధులతో సమీక్ష చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని..వారి బ్యాంక్ లోన్లు రీ షెడ్యూల్ చేయడం, ఈఎంఐలకు గడువు ఇవ్వడం వంటి అంశాలపై బ్యాంకులు ఉదారంగా ఉండాలని సిఎం సూచించారు. వరదలకు దెబ్బతిన్న వాహనాలకు బీమా అందించే విషయంలో క్లెయిమ్ నమోదైన 7 రోజుల్లో కంప్లీట్ చేయాలని సూచించారు. దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్ చేయించే విషయంలో, కష్టమర్లను చేరుకునే విషయంలో ఆయా కంపెనీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని సిఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలు బాధల్లో ఉంటే మల్టీనేషన్ కంపెనీలు అందుకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ఇళ్లల్లో దెబ్బతిన్న టివిలు, ఫ్రిజ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు బాగుచేసే విషయంలో వేగంగా పనిచేయాలని సిఎం సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ స‌మావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశవ్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్‌, ముఖ్య కార్య‌ద‌ర్శి (ప్లానింగ్‌) పీయూష్ కుమార్, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న త‌దిత‌రులు పాల్గొన్నారు. స‌మావేశంలో వ‌ర‌ద న‌ష్టాల క్లెయిమ్‌ల ప‌రిష్కారం, రుణాల రీషెడ్యూలింగ్‌, రీ స్ట్ర‌క్చ‌ర్‌, మార‌టోరియం, అవ‌స‌రం ఆధారిత కొత్త రుణాల మంజూరు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల రిపేరింగ్ త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *