Breaking News

కువైట్ లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్నార్టీ 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి షేక్ రసీదా బేగం సహాయ సహకారాలతో ఈరోజు స్వగ్రామానికి తీసుకురావడం జరుగుతుంది. గత రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ ఐ ఎక్స్ 698 ద్వారా కవిత ఉదయం 7 గంటలకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ఉపాధి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా కువైట్ వెళ్లిన కవితకు పని ప్రదేశంలో అనేక ఇబ్బందులకు గురయినట్లు వీడియో ద్వారా తెలియజేశారు. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వీడియో ద్వారా సంప్రదించడంతో, తక్షణమే స్పందించిన రవాణా శాఖ మంత్రి, ప్రవాసంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో ఉత్తరప్రత్త్యుత్తరాలు జరిపారు. కవితను తన స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాల్సిందిగా వ్రాతపూర్వకంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. నిన్న ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ యన్ ఆర్ టి అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు స్పందించిన ఏపీ ఎన్నార్టీ 24 గంటల అత్యవసర విభాగం కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళిని ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. మురళి తోపాటు అక్కడే ఉన్న రషీదా బేగం అనే ప్రవాసాంధ్ర మహిళ ఇరువురు కలిసి కవిత ఆశ్రయం పొందిన ప్రాంతానికి వెళ్లి, ఆవిడను సురక్షితంగా దేశానికి తిరిగి పంపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. గతరాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా బయలుదేరిన కవిత ఈరోజు ఉదయం 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ విషయంపై స్పందించిన కవిత భర్త వెంకటేశ్వర్లు తాము ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశాలకు తన భార్య వెళ్ళిందని, ఆ పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు ఎదురవడంతో తాను తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయిన నేపద్యంలో, చివరి ఆశగా ఆవిడ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సంప్రదించడం, ఆయన తక్షణమే స్పందించి ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు విషయం తెలియజేసి 12 గంటల లోపే ఆవిడను దేశానికి తీసుకొస్తుండటం ఆనందించదగిన విషయమని అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *