Breaking News

ఈనెల 25 నగరంలో శ్రీ వారాహి మహారధ యాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్‌ ట్రస్ట్‌ తిరుచానూరు, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌, త్రిశక్తి వారాహి పీఠం, పల్లకొండ, వేలూరు జిల్లా, తమిళనాడు సంయుక్తంగా శ్రీ వారాహి మహారధ యాత్ర చేయనున్నారు. శనివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు శ్రీ మహారుద్రస్వామి మాట్లాడుతూ వారాహి అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కరుణామయి అమ్మవారని అమ్మవారి విశిష్టతను తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని సంకల్పంతో ఈ యాత్రను చేస్తున్నామన్నారు. ఈ యాత్రలో వారాహిదేవి విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ, ప్రధాన పట్టణాలలో వారాహి మహాయాగంలో ప్రజలందరినీ మమేకం చేసి పర్యావరణ పరిరక్షణ నిమిత్తం దేవాతావృక్షాలైన బిల్వ, మారేడు, వేప, రావి, మఱ్ఱి మొదలగు చెట్లను ఆ పట్టణంలో వుండేవిధంగా ప్రజల చేత ఉచితంగా నాటిస్తూ చెట్లు కావలసిన వారికి పంచుతూ ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ రధయాత్ర ఈనెల 22 నుండి తిరుపతి నుండి బయలుదేరి 23వ తేదీన నెల్లూరు, 24వ తేదీన ఓంగోలు, 25వ తేదీన విజయవాడ, 26 రాజమండ్రి, 27 కాకినాడ, 28 విశాఖపట్టణంలో ఈ శ్రీ వారాహి అమ్మవారి రధయాత్ర కొనసాగుతూ సాయంత్రం ఆ పట్టణంలో మహా యాగముతో ముగుస్తుందని తెలిపారు. ఈ రధయాత్ర విజయవాడ కృష్ణాబ్యారేజీ సమీపం నుండి ప్రారంభమైన నగరమంతా భక్తులకు దర్శనమిచ్చి చివరికి బబ్బూరి గ్రౌండ్స్‌ వద్దకు చేరుతుందన్నారు. శ్రీ వారాహి మహారధ యాత్రలో, యాగంలో భారీ సంఖ్యలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, కృపాకటాక్షాలను పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెంపుల్‌ కార్యదర్శి జి.ఎన్‌.రాజు, విజయవాడ రధయాత్ర పర్యవేక్షకులు శివప్రసాద్‌, శేషగిరిరావు, బుజ్జి, బండి శివారెడ్డి, జి.రేలంగి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *