Breaking News

ఎంపిపి స్కూలు ఉపాధ్యాయులు, బిసి సంక్షేమ వసతి గృహం అధికారి లను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలో చదువుతున్న బాలికల పట్ల అనైతికంగా ప్రవర్తించడం తో సాటిలైట్ ఎంపిపి స్కూలు కు చెందిన ఉపాధ్యాయులు పి సన్యాసిరావు ను, ప్రభుత్వ బిసి కళాశాల వసతి గృహం వసతి సంక్షేమ అధికారి ఎమ్. సత్య కుమారి లని విధులు నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

శాటిలిటిసిటీ, రాజమహేంద్రవరం రూరల్   ఎమ్ పిపి పాఠశాల ఉపాధ్యాయులు పి.సన్యాసిరావు అదే పాఠశాలలో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం మరియు అమాయక బాలికలపై అనైతికంగా , అసభ్యత తో వ్యవహరించడం పై వొచ్చిన ఫిర్యాదు నేపధ్యంలో విచారణ చేపట్టడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్రాథమిక ఆధారాలను అనుసరించి సస్పెన్షన్ చేస్తూ ఇన్చార్జి జిల్లా పాఠశాల విద్యాధికారి వి వెంకట రాజు ఉత్తర్వులు జారీ  చెయ్యడం జరిగిందనీ తెలిపారు. మరియు విద్యార్థినీల పట్ల సదరు ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు ను తీవ్రంగా పరిగణించడం జరిగిందన్నారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో  74 బి ఎన్ ఎస్/ 7 ఆర్/ డబ్ల్యు – 8 పోస్కో యాక్ట్ 2012 అనుసరించి 173 బి ఎన్ ఎస్ ఎస్ కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ బీసీ కళాశాల హాస్టల్ , రాజమహేంద్రవరం (రూరల్), హాస్టల్ విద్యార్థులు  జిల్లా కలెక్టర్‌తో కలిసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ఎమ్  సత్య కుమారి పై ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఈ నేపధ్యంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి, రాజమండ్రి రెవెన్యు డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. హాస్టల్ నిర్వహణ విషయంలో క్రమ శిక్షణా ఉల్లంఘన, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించక పోవడం వంటి లోపాలను విచారణ సమయంలో గుర్తించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సీసీఏ రూల్ కి లోబడి వసతి గృహ సంక్షేమ అధికారి బి . శశాంక , ప్రభుత్వ బిసి సంక్షేమ వసతి గృహం  సంక్షేమ అధికారి ఎమ్ . సత్య కుమారి సర్వీసు నుండి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసియున్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *