Breaking News

జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ కళాశాల, పద్మావతి పురం నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 20-09-2024 అనగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ(Govt ITI,Padmavati Puram,Tirupati)నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది.

ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వి శ్రీలక్ష్మి, ప్రిన్సిపాల్, ఐటిఐ, తిరుపతి మాట్లాడుతూ ప్రతి నెల ఇటువంటి జాబ్ మేళాలు గవర్నమెంట్ ఐటిఐ నందు నిర్వహించడం జరుగుతుందని కావున ఇటువంటి సదవకాశాన్ని జిల్లాలో ఉన్న యువతీ యువకుల సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు మరియు విద్య అర్హతకు తగ్గట్టు ఇంటర్వ్యూలో పాల్గొని అవకాశం అందుకొచ్చుకొని రాణించాలని అన్నారు. ఈ జాబ్ మేళాకు వివిధ రంగాలకు చెందిన 4 బహుళ జాతీయ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు హాజరవ్వడం జరిగినది.

ఇందులో భాగంగా ఈరోజు జరిగిన జాబ్ మేళాకు 102 మంది యువతీ యువకుల వివిధ కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరవుగా 69 మంది యువతీ యువకులు వివిధ కంపెనీలలో ఉద్యోగ అర్హత పొందడం జరిగినది.. సెలెక్ట్ అయిన వారందరికీ అభినందనలు మరియు ఆఫర్ లెటర్లు ,ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందించారు.

ఈ కార్యక్రమంలో గంగాధరం  ట్రైనింగ్& ప్లేస్మెంట్ ఆఫీసర్ , ఐటిఐ కళాశాల, ఏ గణేష్ ,ప్లేస్మెంట్ ఆఫీసర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ, సునేషు, నాన్ టెక్నికల్ ఆఫీసర్, ఓ హిమబిందు స్కిల్ హెబ్ కోఆర్డినేటర్ మరియు ఈ ఎస్సీ కోఆర్డినేటర్లుగా శ్రీలక్ష్మి, మహేష్ లు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *