విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించాలననె ఉద్దేశంతో సుజన ఫౌండేషన్, మరియు షేర్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గడచిన ఆగస్టు నెలలో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ప్రారంభించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నడపబడుతుంది. ఇటీవల సంభవించిన వరదల కారణంగా వాయిదా పడిన వైద్య శిబిరం పశ్చిమ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 29 వరకు భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో మహిళల కోసం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, థైరాయిడ్, టిబి, చెవి, ముక్కు, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సలు నిర్వహిస్తూ అవసరమైన వారికి మందులను అందజేస్తున్నారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సి ఎల్ వెంకట్రావు, ఇ ఎన్ టి డాక్టర్ బాల కోటేశ్వరరావు, డాక్టర్ సురేష్ , గైనకాలజీ నిపుణులు డాక్టర్ రత్నప్రభ ఉచిత వైద్య శిబిరంలో తమ సేవలను అందిస్తున్నారు. ఇప్పటివరకు 1,354 మందికి ఆరోగ్యపరీక్ష నిర్వహించి ఉచితంగా మందులను అందజేశామని శాసనసభ్యులు సుజనా చౌదరి తమ x ఖాతాలో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి వైద్యం అందించాలనె లక్ష్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని హెల్త్ క్యాంప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొమ్మ కంటి వెంకటరమణ తెలిపారు. సెప్టెంబర్ 29 వరకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని పశ్చిమ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుజనా ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరమాచనేని కిరణ్ తెలిపారు. సుజనా ఫౌండేషన్ సిబ్బంది చింతా సృజన్, బాబి, మంతెన తరుణ్, వైద్య శిబిరంలో తమ సేవలను అందిస్తున్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …