ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైఎస్ షర్మిల

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ షర్మిలా రెడ్డి, తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య మర్యాదపూర్వక భేటీ జరిగింది.