విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) గుడివాడ శాసనసభ్యులు వేనిగండ్ల రాము శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో కె ఎస్ రామారావు లతో కలిసి ఆవిష్కరించారు. ఉత్సవాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్దేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి నేతల సహకారంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను ముమ్మరం చేసామన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వాధికారుల ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …