Breaking News

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పోస్టర్ ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పోస్టర్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు మరియు సిబ్బందితో కలిసి విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ యోజన 6 వ వార్షికోత్సవం సందర్భంగా ఆయుష్మాన్ పఖ్వాడా వేడుకలలో భాగంగా ఆయుష్మాన్ భారత్ వైద్య శిబిరంను Dr NTR వైద్య సేవ పథకం చే గుర్తించిన తిరుపతి జిల్లాలోని అన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఉచిత ఓ పి సేవలు నిర్వహించారని తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రధాని మోదీ సెప్టెంబర్ 23, 2018 న ప్రవేశ పెట్టి, నేటికి ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ పఖ్వాడా ను నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాల గురించి అవగాహన కార్యక్రమాలు, 70 ఏళ్ళు పైబడిన అర్హులకు ఆయుష్మాన్ కార్డులను మంజూరు చేయనున్నారని అన్నారు. మిలియన్ల మంది యెక్క ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకు రావడానికి , ప్రతి ఆయుష్మాన్ కార్డు న్యాయమైన సంరక్షణ, ఆశ మరియు ప్రాముఖ్యతను సూచిస్తుందని, ఆరోగ్యకరమైన భారత దేశాన్ని తయారు చేయడమే ఈ పథక యొక్క లక్ష్యం అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీహరి, డా.ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ రాజశేఖర్, జిల్లా డా. ఎన్టీఆర్ వైద్య సేవ మేనేజర్ శివకుమార్, డి సి హెచ్ ఎస్ ఆనందమూర్తి , తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *