గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణలకు ఆనందయ్య కరోనా మందు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ  వారి  గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ పశ్చిమ నియొజకవర్గం, హిందూ హైస్కూల్ ఎదురు సందు, వట్టూరి వారి వీధి, సాయిబాబా కార్ ట్రావెల్స్ వద్ద నాయీ బ్రాహ్మణ సోదరులకు 1000 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ గారి కరోనా మందు పంపిణీ జరిగింది. ఈ సంధర్భంగా నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు చిప్పాడా మారుతి రావు, ఆంధ్ర ప్రదేశ్ బి.సి.చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వి.రామారావులు మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణా విదేశాల్లో ఉన్నపటికీ మాతృభూమి మీద మమకారంతో తల్లి దండ్రుల పేరు మీద ట్రస్ట్ పెట్టి కరోనా మొదలు నుంచి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నరన్నారు. మొదటి దశ కరోనా సమయంలో కూడా నాయీ బ్రాహ్మణలకు మాస్క్ లు, సానిటీజర్స్, సెలూన్లోని పని సామగ్రి కిట్లు, నిత్యావసర సరుకులు అందజేసిన రవి కృష్ణాకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. బి.సి. ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అధ్యక్షులు నమ్మి అప్పారావు, కార్పొరేటర్ ఉమ్మడి చంటిలు మాట్లాడుతూ గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవి కృష్ణాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రవి కృష్ణా స్థాపించిన గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద, బడుగు బలహీన వర్గాల వారికి లబ్ది చేకూరుతుందన్నారు. రవి కృష్ణా సేవా స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు ఉప్పిడి రాము, దుబాసి శ్రీను, గూడ పలస పూర్ణ చంద్రరావు, అరసవల్లి రాజు, కుప్పిలి నాగు, పట్నాల వెంకటేష్, చిట్టాబత్తుల సతీష్, దుబాసి లోకేష్, గూడ పలస కిషోర్, చిప్పాడా తిలక్, శరత్ నందన్, కమ్యూనిస్ట్ నాయకులు తాడి పైడయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఈనెల 27 వతేదీ కి మండల కమిటీ లు పూర్తి చేయాలి…

-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *