Breaking News

వరద బాధితులకు పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

-అకౌంట్లకు రూ.588 కోట్లు జమ చేసినట్లు సీఎంకు వివరించిన అధికారులు
-సాంకేతిక సమస్యలు పరిష్కరించి మిగిలిన 3 శాతం మంది బాధితులకూ పరిహారం ఇవ్వాలన్న సీఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి గాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో రైతులకు పంట నష్టపరిహారం కింద జరిపే చెల్లింపులు రూ.301 కోట్లు కాగా…మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధితుల అకౌంట్లకు నగదు డీబీటీ పద్ధతిలో అందించగా…..అందులో 97 శాతం మంది లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం జమ అయ్యిందని అధికారులు వివరించారు. అయితే 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ అవ్వలేదని అధికారులు వివరించారు. బ్యాంక్ అంకౌట్ తో ఆధార్ లింక్ అవ్వకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ అవ్వకపోవడం, అకౌంట్ యాక్టివ్ గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదు అవ్వడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంక్ కు వెళ్లి కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరామని…రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. బ్యాంకు అకౌంట్లకు మరో సారి డబ్బులు బదిలీ చేశామని..ఈ రోజు సాకేంతిక సమస్య పరిష్కరించుకున్న వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేయాలని…ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సిఎం సూచించారు. అర్హులెవరికీ సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదు అని సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని…వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వ నుండి సాయం అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హులుగా ఎంపికై ఎవరికైతే డబ్బులు వారి అకౌంట్లలో పడలేదో…..వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రజలను కోరుతున్నామని అధికారులు తెలిపారు. వచ్చే శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చెయ్యాలని సిఎం అధికారులను ఆదేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

మంత్రి సవితకు సీపీఐ రామకృష్ణ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *