Breaking News

క్యూలైన్లో ఉన్న భక్తుల వద్దకే త్రాగునీటిని పంపిణీ చేయండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్రాగునీరు కోసం 25 ప్రాంతాలలో పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ క్యూలైన్లో ఉన్న భక్తుల వద్దకే త్రాగునీటి పంపిణీ చేయాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సిబ్బందిని పెంచి రెండు పాయింట్లు మధ్యలో ఉన్న భక్తులకు త్రాగునీటి లోపం లేకుండా వారి వద్దకే పంపిణీ చేయాలని అలాగే అమ్మవారి భక్తులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన శాఖాధిపతుల సమావేశంలో అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రులలో వచ్చే అమ్మవారి భక్తులకు అవసరమయ్యే త్రాగునీటి సౌకర్యాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, క్లాక్ రూమ్స్ ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, త్రాగునీరు కోసం 25 ప్రాంతాలలో ఏర్పాటుచేసిన ఏర్పాటు చేసిన త్రాగునీటి సౌకర్యాలను కేవలం ఆ పాయింట్లలోనే కాకుండా క్యూ లైన్ లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా సిబ్బందిని పెంచి, క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వారే భక్తుల వద్దకు వెళ్లి త్రాగునీటిని అందించే విధంగా, క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకలగకుండా చూసుకోవాలని అధికారులని ఆదేశించారు.

తాత్కాలిక మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ, మరుగుదొడ్ల నిర్వహణ లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో ఏర్పాటు చేసిన 31 ప్రాంతాలలో పారిశుధ్య కార్మికులతో అధికారులు పర్యవేక్షిస్తూ ఎక్కడ పారిశుద్ధ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అమ్మవారి భక్తుల కోసం
విజయవాడ నగరపాలక సంస్థ వారు ఆరు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన ఉచిత క్లాక్ రూమ్స్ మరియు చెప్పుల స్టాండ్ ను రథం సెంటర్, విఎంసి ప్రధాన కార్యాలయం ఎదురుగా, సీతమ్మ వారి పాదాలు, కుమ్మరిపాలెం సెంటర్, పున్నమి ఘాట్, పద్మావతి ఘాట్ వద్ద ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని కమిషనర్ అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *