Breaking News

స్వాతంత్య్రం కంటే స్వఛ్చత కే మహాత్మ గాందీజీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో పరిశుభ్రత పాటించటం వలనే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది వేయవచ్చని స్వాతంత్య్రం కంటే స్వఛ్చత కే మహాత్మ గాందీజీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
బుధవారం శ్రీవెంకటేశ్వరవిజ్ఞాన మందిరంలో జరిగిన స్వఛ్చత హీ సేవా ముంగిపు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు ఎండీ నసీర్ అహ్మద్, గల్లా మాధవితో కలసి పాల్గోన్నారు. సభలో జ్యోతి వెలిగించి మహాత్మ గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సంధర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర మంత్రి స్వఛ్చత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం, సమానత్వం, అహింస కోసం గాందీజీ నిరంతరం కృషి చేశారన్నారు. పరిసరాల పరిశుభ్రతలో కీలక భూమిక పోషించే పారిశుద్ధ్య కార్మికుల ఆత్మభిమానం పెంపొందించేలా వారికి అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్దితో అమలు చేయటం జరుగుతుందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో సైతం పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలు అందించారన్నారు. పరిశుభ్రత అనేది నిరంతరం కార్యక్రమని ప్రతి ఒక్కరూ వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసుకొని పారిశుద్ద్య కార్మికులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమంలో భాగస్వాములై సహకరించటం వలనే స్వఛ్ఛ గుంటూరు, స్వఛ్చ ఆంధ్రప్రదేశ్, స్వఛ్చ భారతదేశం సాధ్యం అవుతుందన్నారు. గుంటూరు నగరాన్ని క్లీన్, గ్రీన్ గా మర్చేందుకు నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో సహకారం అందించటం జరుగుతుందన్నారు. మహాత్మ గాందీ చెప్పినట్లు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకు సిద్ధాంతాన్ని పాటించటంతో పాటు ప్రస్తుతం సమాజం ముందుకు వెళ్ళటానికి మంచిని చూడటం, మంచి గురించి మాట్లాడటం, మంచిని ప్రోత్సహించాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ మహాత్మ గాంధీ నుంచి స్పూర్తి పొందే అంశాలలో స్వఛ్చత ప్రదానమైనదని అందువలనే గౌరవ ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ 2014 నుంచి గాందీ జన్మదినం రోజు అక్టోబరు 2 స్వఛ్చ భారత్ పేరుతో స్వఛ్చత హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. పరిసరాల పరిశుభ్రత అవశ్యకతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ఉద్యేశ్యంతో 2017 నుంచి స్వఛ్చత హీ సేవాలో భాగంగా గాందీ జయింతికి పదిహేను రోజుల ముందు నుంచి స్వఛ్చత హీ సేవా కార్యక్రమాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోను నిర్వహించటం జరుగుతుందన్నారు. జిల్లాలో సెప్టెంబరు 17వ తేదీ నుంచి అక్టోబరు 1 వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో స్వఛ్చ ప్రతిజ్ఇలు చేయించటం, శుభ్రత కార్యక్రమాలు నిర్వహించటం తో పాటు ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం, సేవా సంస్థల భాగస్వామ్యంతో స్వఛ్చత పై అవగాహన కోసం ర్యాలీలు, మానవహారాలు, సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించటం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, అరోగ్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలను నిర్వహించటం జరిగిందన్నారు. బహిరంగ ప్రదేశాల్లోను, వీదుల్లోను వ్యర్ధాలను వేయకుండా నిర్దేశించిన ప్రాంతాల్లోని చెత్త డబ్బాలలోనే వేయాలని చిన్నారులకు అవగాహన కల్పించటంతో, పెద్దలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇంటిలోఉత్పన్నమయ్యే తడి, పొడి వ్యర్ధాలను సక్రమ నిర్వహణ తో పాటు, వ్యాపార సంస్థలలోను ఉత్పనమయ్యే వ్యర్ధాలను సక్రమంగా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. హాస్పిటల్ లో ఉత్పన్నమయ్యే బయో వేస్టే, ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి ఈ వేస్ట్ ను సంబంధిత ఎజెన్సీల ద్వారా సక్రమంగా డిస్పోజ్ చేయాలని, పర్యావరణానికి హాని కలిగించి నిషేధిత ప్లాస్టిక్ వినియోగించరాదన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించేందుకు ప్రతి గ్రామంలో సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహించటం జరుగుతుందని, పశువుల వ్యర్ధాలను సైతం బయో గ్యాస్ గా మార్చి వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించటం జరుగుతుందన్నారు. జిల్లాలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటానికి నిబధ్ధతతో పనిచేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులకు జిల్లా ప్రజలు తరుపున, యంత్రాంగం తరుపున దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వఛ్చ గుంటూరు సాధనకు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు. 2013 లో గుంటూరులో పారిశుద్ధ్య విభాగంలో ప్రారంభించిన రెండు రకాల చెత్త డబ్బాలు మరియు పుష్ కాట్స్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. రానున్న కాలంలో మెరుగైన పారిశుధ్యంలో గుంటూరు నగరం రోల్ మోడల్ గా నిలించేందుక కృషి చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, పీఎఫ్ సమస్యలు పరిష్కారిస్తామన్నరు.
తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఎండీ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ కంటి రెప్పాల కాపాడుతున్న కార్మికులకు ప్రతి ఒక్కరు దన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. పరిశుబ్రత కేవలం కార్మికుల భాద్యతే కాదని, ఇది ప్రజలందరి సమిష్టి బాధ్యత అన్నారు. నగరంలో ప్రతి నెల ఒక డివిజన్ లో ప్రత్యేక శానిటేషన్ చేపట్టాలని కమిషనర్ నుకోరారు.
పశ్చిమ నియోకవర్గ శాసనసభ్యులు గళ్లా మాధవి మాట్లాడుతూ స్వఛ్చత స్పూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు స్వఛ్చ గుంటూరు సహకారానికి కృషి చేస్తామన్నరు. గుంటూరు మిర్చి, పొగాకు, విద్యాసంస్థలకు ప్రసిధ్ది చెందిన విధంగా స్వఛ్చతలో కూడ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ, గ్రీన్ గుంటూరుగా మార్చుందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అన్నారు.
ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ ఆర్) వీరా స్వామి మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశ్రుతకు ఇచ్చిన ప్రాధాన్యతను పరిసరాల పరిశుభ్రతకు పాటించటం వలనే స్వఛ్చ గుంటూరు సాద్యం అవుతుందన్నారు. ఐటీసీ సామాజిక సేవ కార్యక్రమంలో గుంటూరులో స్వఛ్చత కార్యక్రమాలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
సభలో పలువురు పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ పీఎఫ్ అకౌంట్లలో చిన్న చిన్న తప్పుల వలన సకాలంలో రుణాలు మంజూరు కావటం లేదని, పిల్లల చదువుకు, ఉపాధికి సహకారం అందించాలని, కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలన్నారు. అదే విధంగా పారిశుధ్ద్య కార్మికుల కొరత వలన అనారోగ్యం ఉన్న శెలవులు మంజూరు కావటం లేదని, డస్ట్ బిన్ లు, పుష్ కాట్ లు అవసరం మేరకు అందించాలని తెలిపారు. పారిశుధ్ద్య కార్మికుల తెలిపిన అంశాలపై కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ పీఎఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోంటామని, మిగతా అంశాలపై నగరపాలక సంస్థ అధికారుల ద్వారా తక్షణమే పరిష్కరిస్తామన్నరు. పారిశుధ్ధ్య కార్మికులు సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించటం జరుగుతుందన్నారు.
ఉత్తమ సేవలు అందించి పారిశుధ్ధ్య కార్మికులను కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు ఎండీ నసీర్ అహ్మద్, గల్లా మాధవి దుశ్శాలువ, జ్ఞాపిక, నూతన వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. స్వఛ్చత హీ సేవా కార్యక్రమానికి సహకారం అందించిన వివిధ సంస్థల ప్రతినిధులకు, పాల్గొన్న విధ్యార్దులకు ఎన్ సీ సీ వాలంటీర్లకు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు ప్రసంశ పత్రాలు, జ్ఞాపికలు అందించారు.
తొలుత జాతిపిత మహాత్మగాంధీ జన్మదినం సంధర్బంగా నగరపాలక సంస్థ సమీపంలోని హిమని సెంటరులోని మహాత్మ గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి పూలమాల వేసి నివాళులర్పించి, స్వీపింగ్ మిషన్లును కేంద్ర మంత్రివర్యులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్వఛ్చత హీ సేవా మాస్ క్లీనింగ్, మొక్కలు నాటే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు ఎండీ నసీర్ అహ్మద్, గల్లా మాధవితో కలసి పాల్గోన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయరు సజీలా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాసు, డి శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణయ్య, సీపీ రాంబాబు, ఎస్ఈ శ్యాం సుందర్, ఎంఓహెచ్ డా. శోభారాణి, ఐటిసి బంగారు భవిష్యత్ నుండి గౌరీ నాయుడు, నారాయాణ, కార్పోరేటర్లు, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *