Breaking News

జిల్లాలో 300 గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె పండుగ వారోత్సవాలు

-అక్టోబరు 14 నుంచి 20 వ తేదీ వరకు రూట్ మ్యాప్ సిద్ధం
-ప్రజాప్రతినిధులు సమక్షంలో ఆయా పనులకు శంఖుస్థాపన
-మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి / జిల్లా మంత్రి కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ తో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శాసనసభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు లు మంగళవారం సాయంత్రం కలెక్టరు ఛాంబర్ లో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ సమావేశ వివరాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశనం మేరకు అక్టోబర్ 14 నుంచి 20 వరకు పల్లె పండుగ వారోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని తెలిపారు.

పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా ఆగష్టు 23 న నిర్వహించిన గ్రామ సభలు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపాదించిన సుమారు 30 వేల పనులను రూ.4500 కోట్ల తో చేపట్టడం జరుగుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 300 గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభలు నిర్వహించి, పనులని గుర్తించడం జరిగిందన్నారు. ఆమేరకు అక్టోబరు 14 నుంచి తలపెట్టిన వారోత్సవాలు, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రహదారి , డ్రెయిన్స్ , ఉపాధి హామీ పథకం కార్యక్రమాలపై జిల్లాలో నియోజక వర్గస్థాయిలో చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులతో చర్చించడం జరిగిందన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే లు సూచించిన విధంగా గ్రామ స్థాయి లో ప్రజాప్రతినిధులతో కలిసి నియోజక వర్గాల వారికీ రౌట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులను అక్టోబర్ 14 నుంచి 20 వరకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని తదుపరి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకారం సమయపాలనతో కూడి ప్రాధాన్యత కు అనుగుణంగా ఆయా పనులను చేపట్టి ప్రారంభించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రజా ప్రతినిధులు పలు సూచనలు చేయడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.

ఈ సమావేశంలో శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించే పార్టీ తెలుగుదేశం

-శాసననభ్యులు గద్దె రామమోహన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలో జాతీయ రాష్ట్ర స్థాయిల్లో అనేక పార్టీలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *