Breaking News

అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు

-అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న వర్గాల నుండి అందిన వినతుల మేరకు మద్యం షాపుల కోసం నిర్దేశించిన దరఖాస్తుల సమర్పణ గడువును అక్టోబరు 11 వరకు పొడిగించినట్లు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అన్ లైన్ తో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబరు 12,13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీస్తారని వివరించారు. అదే రోజు కేటాయింపు ప్రకియను పూర్తి చేస్తామని, అక్టోబరు 16 వ తేదీ నుండి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రవేటు మద్యం షాఫులు అందుబాటు లోకి వస్తాయని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *