రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో షాపు లకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో సోమవారం ఉదయం నుంచి nurcshydtuunn మద్యం దుకాణాల లాటరీ పద్ధతిని కలెక్టరు ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్యం నూతన పాలసీ విధానంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులని లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకం చేపట్టటం జరుగుతున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో ప్రక్రియని నిర్వహిస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. జిల్లా పరిధిలో 125 షాపులు కోసం అభ్యర్థులు చేసుకున్న 4384 దరఖాస్తులు రాష్ట్రంలో మూడోవ స్థానంలో జిల్లా నిలిచిందని, సగటున ఒక్కో షాపు కోసం 35 దరఖాస్తులు వెయ్యడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ అనుసరించి తొలుత రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని షాపుల లాటరీ ప్రక్రియ ప్రారంభం చేశామన్నారు. తదుపరి మండలాలు , మున్సిపాలిటీ వారీగా అక్షర క్రమంలో మండలాల వారీగా లాటరీ పద్ధతిలో షాపులు కేటాయింపు జరపనున్నట్లు పేర్కొన్నారు. లాటరీ పద్ధతిలో మొదటి వ్యక్తి కేటాయింపు జరపడంతో పాటుగా నిర్ణీతకాలవ్యవధిలో ఫీజ్ చెల్లించని యెడల తదుపరి మరో ఇద్దరు పేర్లని కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన రిజర్వ్ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎక్సైజ్ , రెవిన్యూ పోలీసులు అధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యడం, దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లు కలెక్టరు ప్రశాంతి పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు షాపులు వారీగా బిడ్స్ వేసిన వారికి ఒక నెంబర్ కేటాయించి, టోకెన్ జారీ చేసి, వారిని మాత్రమే హాల్ లోకి అనుమతిస్తూ, తదుపరి వారీ సమక్షం టోకెన్ నెంబర్ లని డ్రాప్ బాక్స్ లో వేసి, డ్రా చెయ్యడం జరిగిందని తెలిపారు. లాటరీ పద్ధతిని పర్యవేక్షణా కోసం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా మద్యం అబ్కారీ అధికారి సి హెచ్ లావణ్య , ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.