-బ్యాంకర్లు, యు సి డి సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఋణ సదుపాయం సులభతరం చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ అర్బన్ లవ్లీ హుడ్ మిషన్ 2.0 ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 క్యాటగిరి లో ఉన్న కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు ఋణ సదుపాయం కల్పించేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా విజయవాడ, విశాఖపట్నం ను ఎంపిక చేసింది. అందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం విఎంసి ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో ఉన్న మీటింగ్ హాల్ నందు టౌన్ లెవెల్ బ్యాంక్ మేనేజర్లతో, యు సి డి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగానే 6 కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ను ఏర్పాటు చేయాలని. ఆ గ్రూపులో ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్, డొమెస్టిక్, వేస్ట్, కేర్ వర్కర్లతో విడివిడిగా గ్రూపులను ఏర్పాటు చేయాలని యుసిడి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే యు సి డి సిబ్బంది ఏర్పాటు చేసిన గ్రూపులకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించవలసిందిగా బ్యాంకర్లను కోరారు.
గతంలో ఉన్న నేషనల్ అర్బన్ లైవ్లి హుడ్ మిషన్, ప్రధానమంత్రి స్వానిధి పథకం ద్వారా మంజూరు చేసిన లోన్ నిమిత్తం నగరంలోని ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న మొత్తం 4808 మంది వీధి విక్రయ దారులకు అర్హత కలిగిన వారికి మొదటి, రెండవ మరియు మూడవ ట్రెంచ్ ఋణాలను త్వరితగతిన మంజూరు చేయవలసిందిగా కమిషనర్ సమావేశానికి హాజరైన 19 బ్యాంక్ కోఆర్డినేటర్లకు సూచించారు. ఈ ఋణాలు మంజూరు కొరకు ఫీల్డ్ స్టాఫ్ లైన ఆర్పీలు, సి ఓ లు, సోషల్ వర్కర్లు, సి డి వో లు, బ్యాంక్ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు ఋణ సదుపాయం కల్పించేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రియాంక, 19 బ్యాంక్ కోఆర్డినేటర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి వెంకటేశ్వర్లు, యు సి డి సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.