Breaking News

శిలా ప‌ల‌కాల‌కే ప‌రిమితం అయిన గ‌త‌పాల‌కులు పాల‌న‌…


-కోటి 40 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుక‌లు శుంకుస్థాప‌న‌
-ర‌హ‌దారుల‌పై వ‌ర్ష‌పు నీరు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టిండి
-అధికారుల‌తో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ‌త పాల‌కులు అభివృద్ది విస్మ‌రించి, శిలాఫ‌ల‌కాల‌కే ప‌రిమితం అయ్యారు అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు… ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌నలో భాగంగా మంత్రి వెలంప‌ల్లి న‌గ‌ర మేయ‌ర్  రాయ‌న భాగ్యల‌క్ష్మి, అధికారుల‌తో ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. శ‌నివారం 43వ డివిజన్ ఊర్మిళానగర్ పోలేరమ్మ గుడి దగ్గర 14వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి రూ.105.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న (వివేకానందనగర్ వీధి, లడ్డా వారి వీధి, మాదాసు రామారావు వీధి, గర్రే అప్పారావు వీధి మరియు ఎస్.ఎస్.వైభవ్ రోడ్లకు) అయిదు (5) సి. సి.రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శంఖుస్ధాపన చేస్తారు. అనంత‌రం చర్చి సెంటరులో రూ35.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న డుప్లెక్స్ హౌసెస్ రోడ్డుకు బి.టి. రోడ్డు నిర్మాణం ప‌నుల‌కు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మేయ‌ర్‌తో క‌లిసి శంఖుస్ధాపన చేస్తారు.” అనంత‌రం పోలీస్ కాల‌నీ, నేతాజీ రోడ్డు, ఎల్.ఐ.సి. బిల్డింగ్ రోడ్డు హెచ్ బి కాల‌నీలో ఎం ఐజి రోడ్డు, పాత ఎంఐజీ రోడ్డు వాట‌ర్ ట్యాంక్ రోడ్డు త‌దిత‌ర ప్రాంతాల‌ను మంత్రి, మేయ‌ర్ అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు.. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.. ఈ ప్రాంతంలో ఖాళీ స్థ‌లాల‌ను శుభ్రం చేసి పార్క్‌లు గా అభివృద్ది చేయాల‌ని అధికారుల‌కు అదేశించారు. అదే విధంగా రాబోయే వ‌ర్ష‌కాలం దృష్ట్యా ర‌హ‌దారుల‌పై నీరు నిల‌వ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ష్ట కాలంలో కూడా విజ‌య‌వాడ అభివృద్దికి ప్ర‌త్యేక శ‌ద్ద్ర‌తో నిధులు కెటాయించ‌డం తో అభివృద్ది ప‌నులు వేగ‌వంతంగా సాగుతున్నాయ‌న్నారు. అభివృద్ది అంటే సీఎం జ‌గ‌న‌న్న అనే నిద‌ర్శ‌నంగా పాల‌న సాగుతుంద‌న్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి ఐకాన్ మాదిరిగా భ‌వానీపురం స్టేడియం నిర్మాస్తామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు భూప‌తి కోటి రెడ్డి, అంజనేయ రెడ్డి, చైత‌న్య రెడ్డి, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డా. ఇక్బాల్ హుస్సైన్ మ‌రియు వైసీపీ నాయ‌కులు మైల‌వ‌ర‌పు దుర్గు రావు, స్థానికులు ఉన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *