Breaking News

జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి వై. లక్ష్మణరావు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవ సదన్‌లో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో డిఎన్ఎస్ఎ ఛైర్మన్ మరియు జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు పాల్గొని జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. జిల్లాలో 80 వేల కేసులు పెండింగ్ లో ఉండగా వీటిల్లో 60 వేల కేసులు రాజీకి అమోదయోగ్యమైనవిగా గుర్తించగా, వీటిల్లో ఈ రోజు జరిగే జాతీయ లోక్ అదాలత్ లో 10,146 కేసులు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇందుకోసం జిల్లాలో 36 లోక్ అదాలత్ బెంచ్ లు ఏర్పాటు చేశామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పర్చుకోవాలన్నారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకుంటే కోర్టుఫీజు వాపస్ పొందవచ్చని ఈ విధంగా లోక్ అదాలత్ లలో తమ కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు 18 లక్ష లురూ.లు పైగా కోర్టు ఫీజు వాపస్ చేసినట్లు జిల్లా జడ్జి తెలిపారు. బజాజ్ అలయన్డ్ జనరల్ ఇన్సూరెన్సు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు 2021 మార్చి 10న ఇచ్చిన తీర్పులో మోటారు వాహన ప్రమాద భీమా కేసుల పరిష్కర విధి విధానాలు నిర్దేశించిందన్నారు. అనంతరం ఈ రోజు లోక్ అదాలత్ లో పరిష్కరించిన మోటారు వాహన ప్రమాద భీమా కేసులకు సంబంధించి ఒక కేసులో 7.50 లక్షలు రూ.లు, మరో కేసులో 4 లక్షల రూ.లు నష్ట పరిహారం అర్డర్స్ జిల్లా జడ్జి కక్షిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. రాజారామ్, న్యాయమూర్తులు ఎ. నరసింహమూర్తి, కె. సీతరామకృష్ణ రావు, పర్మినెంట్ లోక్ అదాలత్ న్యాయమూర్తి ఎం. రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జితేంద్ర, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Check Also

వైభ‌వంగా భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌లు

– స‌జావుగా ఆధ్మాత్మిక శోభ‌తో తొలిరోజు కార్య‌క్ర‌మం – ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *